Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral video: వామ్మో.. ఇదేంటి తల్లి అది పుచ్చకాయ అనుకున్నావా…లేక ఇంకెందనుకునావ్?

Viral video: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎంతో మంది ఎక్కువగా నిమ్మరసం,మజ్జిగ, పుచ్చకాయ, కరబూజ వంటి పండ్లను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఈ విధంగా నీటి శాతం అధికంగా కలిగిన పండ్లను తినడం వల్ల మన శరీరం ఎంతో హైడ్రేట్ గా ఉంటుందని, ఇలాంటి పండ్లు పండ్ల రసాలు తాగడం వల్ల మన పై ఎండదెబ్బ ప్రభావం ఉండదని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి కూడా వేసవి కాలంలో ఇలాంటి పండ్లు అధికంగా దిగుమతి ... Read more

By Ramesh Babu

Published on: May 11, 2022 11:57 AM

Updated on: May 11, 2022 11:57 AM

---Advertisement---

Viral video: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎంతో మంది ఎక్కువగా నిమ్మరసం,మజ్జిగ, పుచ్చకాయ, కరబూజ వంటి పండ్లను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఈ విధంగా నీటి శాతం అధికంగా కలిగిన పండ్లను తినడం వల్ల మన శరీరం ఎంతో హైడ్రేట్ గా ఉంటుందని, ఇలాంటి పండ్లు పండ్ల రసాలు తాగడం వల్ల మన పై ఎండదెబ్బ ప్రభావం ఉండదని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి కూడా వేసవి కాలంలో ఇలాంటి పండ్లు అధికంగా దిగుమతి అవుతాయి. అయితే తాజాగా ఓ మహిళ పుచ్చకాయ తీసుకొని వింతగా ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఆ మహిళ పుచ్చకాయ తీసుకొని ముందుగా తన మొహానికి రుద్దుకుంది. మొహం నుంచి బుగ్గలకు అలాగే దవడ వరకు పుచ్చకాయతో రుద్దుకొని అనంతరం ఆ పుచ్చకాయను తింటూ ఈ పుచ్చకాయ ధర ఎంత అంటూ కాయలు అమ్మే వ్యక్తిని అడిగింది. దీంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి ఖంగు తిన్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ ఫన్నీ వీడియో పై ఎంతో మంది నెటిజన్లు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఏంటమ్మా అసలు అది పుచ్చకాయ అనుకున్నావా లేక మరేదైనా అనుకున్నావా… అలా చేస్తున్నావ్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. తను పుచ్చకాయతో చేసిన ఈ వ్యవహారం చూస్తుంటే తనకు వాంతి వస్తుంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సంఖ్యలో లైక్స్ , కామెంట్లు వచ్చాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని ఒకసారి చూసేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by Memer ✨ (@engineer.hu_)

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.