Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Health Tips : వేసవి కాలంలో రాగి అంబలితో కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Health Tips : మారుతున్న జీవన శైలితో పాటు, ఆహారపు అలవాట్లను కూడా క్రమేపీ మార్చుకుంటూ వచ్చారు. అలాంటి వాటిలో ఒకటే రాగి అంబలి త్రాగడం. చద్ది అన్నం తినడం వల్ల శరీరా

By Ramesh Babu

Published on: March 31, 2022 1:12 PM

Updated on: April 3, 2022 7:53 PM

there-is-a-amazing-benefits-of ragi ambali-during-the-summer

---Advertisement---

Health Tips : మారుతున్న జీవన శైలితో పాటు, ఆహారపు అలవాట్లను కూడా క్రమేపీ మార్చుకుంటూ వచ్చారు. అలాంటి వాటిలో ఒకటే రాగి అంబలి త్రాగడం. చద్ది అన్నం తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు తిరిగి అనేకమంది ఈ పద్ధతులను అలవరచుకుంటున్నారు. వేసవి లో కలిగే వేడిని తట్టుకోవడానికి పాత కాలంలో రాగి అంబలి ఎక్కువగా సేవించేవారు. దీనినీ తరచుగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

  • ఈ మధ్య కాలంలో కాలంలో బీపీ, షుగర్ వంటి సమస్యలు అందరిని ఎక్కువగా వేధిస్తున్నాయి. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు వాటిని అదుపులో ఉంచడానికి రాగి అంబలి ని సేవించడం మంచిదనీ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
  • ఏమైనా ప్రమాదాలకు గురైనప్పుడు ఎక్కువగా రక్తస్రావం అవుతున్న సమయంలో రాగి అంబలి సేవించడం వల్ల రక్తస్రావం జరగకుండా ఉంటుంది.
  • శరీరీర బరువును తగ్గించడంలో రాగి అంబలి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. స్థూలకాయంతో బాధపడేవారు ప్రతి రోజు రాగి అంబలి తీసుకోవడం వల్ల తొందరగా ఆకలి వేయదు. తద్వారా అధిక బరువు ఉన్నవారు బరువు త్వరగా తగ్గవచ్చు.
  • అంబలి తాగడం వల్ల పురుషులలో వీర్య కణాలు ఉత్పత్తి ఎక్కువ అవుతుంది.
    ప్రతి రోజూ ఉదయం టిఫిన్ తినటానికి బదులుగా రాగి అంబలి సేవించడం వల్ల రోజంతా ఎంతో చురుకుగా , శక్తివంతంగా ఉంటారు.
  • రాగి అంబలి ని తరచూ తాగడం వల్ల మెదడు పని తీరు మెరుగు పడి, చురుకుగా ఉంటారు.
    ముఖ్యంగా వేసవికాలంలో శరీరంలో వేడి తగ్గించి కాలువను పెంచుతుంది.
  • శారీరక శ్రమ చేసే వారు రోజంతా ఉత్సాహంగా పని చేయడానికి రాగి అంబలి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
Health Tips
Health Tips

రాగి అంబలి ని తయారు చేసుకునే విధానం:
రాగులను తీసుకొని వాటిని కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత ఒక వస్త్రం తీసుకొని వాటిని వేసి తిరిగి కొన్ని గంటలు, మొలకలు వచ్చేవరకు పెట్టాలి. వాటిని బాగా ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఆ పొడిని కొంత నీటిలో వేసి ఉడకపెడితే జావ తయారవుతుంది. ఈ మిశ్రమంలో జీడి పప్పు, కిస్మిస్, తేనె, పల్లీలు వంటివి వేసుకుని తాగవచ్చు. లేదా కాస్త ఉప్పు, కారం వేసుకున్న కూడా అంబలి రెఢీ అవుతుంది.

Advertisement

Read Also : Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.