Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?

Banjara Hills Pub Case : గత రాత్రి హైదారాబాద్ లోని బంజారాహిల్స్ లో ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లేట్ నైట్ కేసులో పలువురు సినీ ప్రముఖులు పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే కేసులో నటి నిహారికను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంపై ఆమె, ఆమె తండ్రి నాగబాబు స్పందించారు. అయితే ఈ కేసులో తన కుమార్తె నిహారిక క్లియర్ అని చెప్పారు. ఇందులో నిహారిక తప్పు ఏం లేదని పోలీసులే చెప్పినట్లు వివరించారు. అయితే సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాంటి అసత్య ప్రచారం చేయకూడదనే ఉద్దేశంతోనే తాను ఓ వీడియోను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే మెగా డాటర్ నిహారిక రాత్రి బంజారాహిల్స్ ర్యాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన ఓ పార్టీకి వెళ్లింది. అయితే సమయానికి మించి పబ్ ని నడుపుతున్నారన్న కారణంతో అక్కడ దాడులు నిర్వహించారు. అయితే అదే సమయంలో అక్కడ డ్రగ్స్ దొరకడంతో.. వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో చాలా మంది ప్రముఖు పిల్లలు, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. సీసీ కేమెరాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also : Actress Hema Reaction : నా పేరు బద్నాం చేస్తున్నారంటూ హేమ షాకింగ్ కామెంట్స్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel