వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Raids On Pub : పబ్ పై పోలీసుల దాడులు.. అదుపులో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్!

Raids On Pub : హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ పై పోలీసులు దాడి చేశారు. అక్కడ జరుగుతున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు. సమయానికి మించి పార్టీని కొనసాగించడంతో పాటు రేవ్ పార్టీని నిర్వహిస్తుండటంతో… మొత్తం 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పబ్ యజమానులతో పాటు 19 మంది సిబ్బంది, 99 మంది యువకులు, 39 మంది యువతులు ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో బిగ్ వాస్ విన్నర్, ... Read more

By Vinod Kumar

Published on: April 3, 2022 10:27 AM

Updated on: April 3, 2022 4:53 PM

---Advertisement---

Raids On Pub : హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ పై పోలీసులు దాడి చేశారు. అక్కడ జరుగుతున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు. సమయానికి మించి పార్టీని కొనసాగించడంతో పాటు రేవ్ పార్టీని నిర్వహిస్తుండటంతో… మొత్తం 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పబ్ యజమానులతో పాటు 19 మంది సిబ్బంది, 99 మంది యువకులు, 39 మంది యువతులు ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో బిగ్ వాస్ విన్నర్, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా ఈ రేవ్‌ పార్టీపై దాడి చేసిన సమయంలో కొకైన్‌, గంజాయి, కొన్ని రకాల డ్రగ్స్‌, ఎల్‌ఎస్‌డీ సిగరెట్లను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. తమ అదుపులో ఉన్న యువతీ యువకుల నుంచి పోలీసులు వివరాలను సేకరించిన అనంతరం వారిని వదిలిపెట్టారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పబ్‌ యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Read Also : Niharika Pub Case : బంజారాహిల్స్ పబ్ కేసులో ప్రముఖులు.. నిహారికకు పోలీసుల నోటీసులు!

, , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel