Krithi shetty: తన్ లవ్ గురించి స్పందించిన కృతి.. దృష్టంతా అక్కడే అంటూ కామెంట్లు!

Krithi shetty: ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఈ అమ్మడు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈమె, రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్, అలాగే తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి నటించనున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న కృతి శెట్టి గురించి గత కొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే అవేంటో ఇప్పుడు చూద్దాం.

కృతి శెట్టి ఓ అజ్ఞాత వ్యక్తితో ప్రేమలో ఉందని… అయితే ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఆమె తాజాగా స్పందించింది. తాను ఎవర్నీ ప్రేమించలేదని… ప్రేమించే వయసు కూడా రాలేదని వెల్లడించింది. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందని.. ఓ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న రూమర్లకు ఈ విధంగా చెక్ పెట్టారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel