Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Ram Charan: కేవలం ఆ కారణం వల్ల నాన్నకు నాలుగు సంవత్సరాలు దూరంగా ఉన్నా: రామ్ చరణ్

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలలో కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల

By Ramesh Babu

Published on: April 21, 2022 1:00 PM

Updated on: April 21, 2022 12:09 PM

---Advertisement---

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలలో కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.ఇలా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.

pjimage 67ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ను యాంకర్ ప్రశ్నిస్తూ.. ఇంట్లో, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కాకుండా ఇలా తండ్రితో కలిసి ఒకే సినిమా షూటింగ్లో పాల్గొనడం ఎలా ఉందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాంచరణ్ సమాధానం చెబుతూ ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ తాను గత నాలుగు సంవత్సరాల నుంచి తన తండ్రికి దూరంగా ఉన్నాననే విషయాన్ని బయటపెట్టారు. ఇలా తన తండ్రికి దూరంగా ఉండడానికి కారణం కూడా రామ్ చరణ్ వెల్లడించారు.

Advertisement

తాను కొత్త ఇంటి నిర్మాణ పనులు చేపట్టడం వల్ల ఆ ఇంటి పనులు చూసుకుంటూ నాలుగు సంవత్సరాల నుంచి తన తండ్రికి దూరంగా ఉన్నానని రామ్ చరణ్ వెల్లడించారు. కేవలం సండే టైం మాత్రమే తన తండ్రితో కలిసి గడిపే వాడినని చరణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక నాలుగు సంవత్సరాల నుంచి తన తండ్రినీ ఎంతో మిస్ అవుతున్న సమయంలో ఆచార్య సినిమా తన తండ్రికి ఎంతో దగ్గర చేసిందని తెలిపారు. ఆచార్య సినిమా షూటింగ్లో భాగంగా తన తండ్రితో కలిసి నెల రోజుల పాటు ఒకే చోట ఉంటూ ఒక్క క్షణం తన తండ్రిని వదలకుండా నాన్నతో గడిపానని నా జీవితంలో ఈ నెల రోజులు ఎంతో మెమరబుల్ అంటూ చరణ్ తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.