Chanakya neethi: పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో చూడాల్సిన లక్షణాలు ఇవే..!

Chanakya neethi:చాలా మందికి అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇలాంటి వాడినే పెళ్లి చేసుకోవాలి అని నియమాలు పెట్టుకుంటారు. కలలు కూడా కంటారు. కానీ మీకు నచ్చిన అమ్మాయిని చేసుకొని తర్వాత బాధపడడం కంటే… ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని చేసుకుంటే చాలా సుఖపడతారని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. అయితే అవేంటి.. పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు అమ్మాయిలో చూడాల్సిన గుణ గణాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చాణక్య నీతి ప్రకారం స్త్రీ అందాన్ని చూసి, వివాహం నిశ్చయించుకోవడం పెద్ద తప్పు కావచ్చు. వివాహానికి బాహ్య సౌందర్యం కంటే ఆమె సుగుణాలు ముఖ్యమని వివరించాడు. అందం కంటే స్త్రీకి సంస్కృతి, విద్య ఉన్నతిని అందిస్తాయి. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం పురుషుడితో పాటు స్త్రీకి కూడా మతపరమైన ఆచారాలపై నమ్మకం ఉండాలి. పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసేందుకు వెళ్లినప్పుడు ఆ యువతి మతపరమైన నమ్మకాలను కల్గి ఉందో లేదో తెలుసుకోవాలి. అలాగే తన ఇష్టానుసారం పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎప్పటికీ సుఖంగా ఉండలేడుట. ఎందుకంటే నచ్చిన జీవిత భాగవస్వామి భవిష్యత్తులో సంతోషాన్ని లేదా గౌరవాన్ని అందించలేదు. ఒత్తిడితో వివాహం చేుకోవడం వైవాహిక జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. మధురంగా మాట్లాడే స్త్రీ ఉండే ఇంట్లో లక్ష్మీ దేవి ఉంటుందని ఆచార్య చాణక్య తెలిపాడు. అందుకే ఎప్పుడూ మధురమైన మాటలే మాట్లాడాలి. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే భర్తతో పాటు అత్తింటి వారంతా ఆనందంగా ఉంటారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel