Chanakya niti: ఈ మూడు పనులు చేసిన వెంటనే స్నానం చేయాలంటున్న చాణక్య..!

Chanakya niti: ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో సంతోషకరమైన జీవితం, పురోగతి గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు. నేటికీ ప్రజలు జీవితాన్ని సంతోషంగా గడపడానికి, విజయాన్ని సొంతం చేసుకోవడానికి కొన్ని విషయాలను సూచించాడు. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో నిత్య కృత్యాల గురించి చాలా విషయాలను కూడా చెప్పారు. ఆచార్య చాణక్యుడు ప్రకారం ఈ 3 పనులు చేసిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా దహన సంస్కారాల తర్వాత.. అంత్యక్రియలకు వెళ్లిన వారు తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయాలి. స్నానం చేయకుండా ఇంట్లోకి రాకూడదు. శ్మశాన వాటికలో అనేక రకాల సూక్ష్మ క్రిములు ఉన్నాయి. ఇవి శరీరానికి హాని కల్గిస్తాయి. అటువంటి పరిస్థితిలో, దహన సంస్కారాల తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. జుట్టు కత్తిరించిన త్రావత.. జుట్టు కత్తిరించిన వెంటనే స్నానం చేయాలి. జుట్టు కత్తిరించేటప్పుడు శరీరంపై చిన్న వెంట్రుకలు అంటుకుంటాయి. కనుక మీ జుట్టు కత్తిరించిన తర్వాత తలస్నానం చేయండి. అలాగే శరీరానికి నూనెతో మసాజ్ చేసిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని మురికి మొత్తం తొలగిపోతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel