...
Telugu NewsLatestGangavva : గంగవ్వ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. స్టార్ అయిపోయింది పో!

Gangavva : గంగవ్వ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. స్టార్ అయిపోయింది పో!

Gangavva : యూట్యూబ్ వీడియోలు, బిగ్ బాస్ చూసే వారికి గంగవ్వ తెలియకపోవడం అంటూ ఉండదు. ఆమె వృద్ధురాలే కావచ్చు. నడవడానికి చాలా కష్టపడుతుండొచ్చు.. కానీ ఆమె మాట్లాడే మాటలు వినాలని, ఆమెతో సెల్ఫీలు దిగాలని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఆమె వీడియోల్లో తిట్టినా, ప్రేమ చూపించినా ఇంట్లో వాళ్లు మాట్లాడినట్లే అనిపిస్తుది. అయితే తాజాగా ఆమె నిర్మల్ జిల్లాలోని గోదావరి నదీ తీరంలో షూటింగ్ కోసం వెళ్లింది. జన్నారం మండలం చింతగూడలోని గోదావరి తీరంలో సందడి చేసింది. తీరంలో ఉన్న లధ్మీదేవి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంది.

Gangavva
Gangavva

అయితే అక్కడ ప్రజలు గంగవ్వను గుర్తించారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు, మాట్లాడేందుకు ఎగబడ్డారు. చాలా సేపు తమతో గడపమని కోరారు. దీంతో పెద్ద మనసుతో గంగవ్వ వారితో చాలా సేపు ముచ్చటించింది. అందరూ బాగా బతకాలంటూ పలు సూచనలు చేసింది. అక్కడున్న వారందరితో పొటోలు దిగింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

Read Also :Anchor Anasuya : వట సావిత్రి పూజ చేసిన యాంకర్ అనసూయ… ఈ పూజ చేయటం వెనుక కారణం అదేనా?

Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు