ప్రస్తుతం ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రచ్చ నడుస్తోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షాన్ని మీటింగ్‌కు పిలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం పవన్ మాటలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. వైసీపీ నేతలు ఆల్ పార్టీ మీట్ అవసరం లేదని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నారు.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనూ ఆయన అఖిలపక్షం మీటింగ్స్‌కు దూరంగా ఉన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన టైంలోనూ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి సమ్మతి తీసుకోకుండానే ఏకపక్షంగా రాజధానిని ప్రకటించారని అప్పట్లో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. అదే విధంగా ప్రత్యేక హోదా విషయంపై వెనక్కి తగ్గి ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు మొగ్గుచూపారు.ఈ విషయంలోనూ ఏపీ ప్రజల మనోభావాలను పట్టించుకున్నపాపాన పోలేదు. తీరా 2019 ఎన్నికలకు కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ చంద్రబాబు అఖిలపక్ష సమావేశం నిర్వహించినా కీలక పార్టీలైన వైసీపీ, జనసేన పార్టీలు హాజరవ్వలేదు.
అయితే, నాడు చంద్రబాబు ఎలాంటి పోకడలకు అయితే వెళ్లారో ప్రస్తుతం జగన్ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఖిల పక్షం నిర్వహించి అన్ని పార్టీల నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లి నేరుగా కేంద్రంతో మాట్లాడితేనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యకు సమాధానం దొరుకుతుందని పవన్ కళ్యాణ్ చెబుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం జగన్ తీరును చూసి చంద్రబాబును గుర్తుచేసుకుంటున్నారు. కానీ రాష్ట్రానికి ఏదైనా సమస్య వస్తే పక్కనున్న కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Read Also : YSRCP-TDP : ప్రతిపక్ష టీడీపీ పార్టీ పొత్తులపై వైసీపీలో జోరుగా చర్చ.. ఎందుకంటే?