YSRCP-TDP : ఏపీలో అధికార వైసీపీ పార్టీ ప్రతిపక్ష టీడీపీ ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. టీడీపీ ఏ చిన్న స్టెప్ తీసుకున్నా దాని వెనుక ద్వందర్థాలను వెతుకుతోంది. టీడీపీ పార్టీ అధికారికంగా ప్రకటించకముందే వైసీపీ లీడర్లు తమకు తాము నిర్ణయించుకుని ఏకంగా కథనాలే అల్లేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పలానా పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని వైసీపీ లీడర్లే జోరుగా ప్రచారం చేస్తున్నారు.
కానీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలో వాస్తవానికి జరుగుతున్నది వేరు. చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తున్నది వాస్తవమే అయినా పొత్తుల విషయమే ప్రస్తుతం ఆయన ఆలోచించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో సంస్థాగత మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికే టికెట్స్ దక్కుతాయని స్పష్టంచేశారు.
ఎవరైతే ఇతర పార్టీల వైపు చూస్తు్న్నారో.. అవకాశాల కోసం ఎదురుచూస్తూ పార్టీని ఎవరైతే నష్టపరుస్తున్నారో వారి చిట్టా కలెక్ట్ చేసి ఒక్కొక్కరిగా వారికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. బాబు తన పనిలో తానుంటే వైసీపీ నేతలు మాత్రం రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ జనసేనతో పొత్తులు పెట్టుకునేందుకు రెడీ అవుతోందని గాలి వార్తలను ప్రచారం చేస్తున్నారు.
గతంలో టీడీపీ కేంద్రంలోని బీజీపీ, జనసేనతో పొత్తుపెట్టుకుని 2014లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా చంద్రబాబు కేంద్రంతో పాటు జనసేనకు కూడా హ్యాండ్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి వైసీపీ చేతిలో చావు దెబ్బ తిన్నారు. అదే టీడీపీ అధినేత చేసిన పెద్ద తప్పుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అమరావతి సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని మరోసారి టీడీపీ బీజేపీకి దగ్గర అవ్వాలని చూస్తోందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే అమరావతి మహోద్యమ సభకు వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. సభా వేదికపై చంద్రబాబు కన్నా లక్ష్మినారాయణను దగ్గరకు రమ్మని పిలిచారని చెప్పి వైసీపీ నేతలు కొత్త చర్చకు తెరలేపారు. కన్నా ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు కాదు. ఆయన్ను ఎందుకు పిలిచారు.
కన్నా ద్వారా మళ్లీ బీజేపీతో ఏకమయ్యేందుకు బాబు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం జనసేన మరియు బీజేపీ పొత్తుపెట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీ పాలన వ్యతిరేకంగా ఉన్న వర్గం మొత్తం ఈ కూటమికి జై కొడితే తమ పరిస్థితి ఏంటని వైసీపీ నేతలు ఆందోళనలో ఉన్నారట..అందుకే చర్చలు సాగిస్తున్నారని తెలుస్తోంది.
Read Also : BJP Swetha Reddy : దేవి శ్రీ ప్రసాద్ చెత్త మ్యూజిక్ డైరెక్టర్.. శ్వేతారెడ్డి సంచలన కామెంట్స్..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world