Bhuma akhila Priya : తమ్ముడి ప్రాణాలకు ముప్పు ఉందంటున్న మాజీ మంత్రి అఖిల ప్రియ

Updated on: February 17, 2022

Bhuma akhila Priya : కర్నూలు జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కింది. ఆళ్లగడ్డలో అధికార,ప్రతిపక్షాల మధ్య మధ్య తీవ్ర స్థాయిలో మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నియోజకవర్గంలో అభివృద్ధి పేరట అధికార పక్షం నేతలు అక్రమాలకు దిగుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గరర ఉన్నాయని చెప్తున్నారు. తాను గానీ చేసిన ఆరోపణనలు నిరూపించలేకపోతే ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని అఖిల ప్రియ ప్రకటించారు.

మరో వైపు తాను చేసిన ఆరోపణలను ప్రూవ్ చేస్తే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా అని అధికార పార్టీ నేత స్థానిక ఎమ్మెల్యేకు సవాల్‌ విసిరారు. అంతేగాకుండా తన తమ్ముడుకు కూడా పోలీసుల నుంచి ఆపద ఉందని ఆమె ఈ రోజు మీడియాకు వివరించారు. తన సోదరుడు జగన్‌ విఖ్యాత్‌ రెడ్డిని చంపేందుకు పెద్ద కుట్రే జరుగుతుందని ఆమె ఆరోపించారు.

bhuma-akhilapriya-sensational-comments-on-allagadda-police-and-mla
bhuma-akhilapriya-sensational-comments-on-allagadda-police-and-mla

తన తండ్రి భూమా నాగి రెడ్డి ప్రజల కోసం కట్టించిన బస్ షెల్టర్ ను వేరే పార్టీ నాయకులు కూల్చి వేస్తా ఉంటే దానిని అడ్డుకున్న తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. ఎలాంటి ఆదేశాలు లేకుండా ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన పబ్లిక్ పాపర్టీలో భాగం అయిన బస్ షెల్టర్‌ను కూల్చి వేశారని అన్నారు. ఇలాంటి దానిపై అధికార పార్టీని ప్రశ్నిస్తే… తన తమ్ముడుపై కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయాలని పోలీసులు చూస్తున్నారని అన్నారు.

Advertisement

తన సోదరుడు ఎలాంటి తప్పు చేయకపోయిన కేసులు పెట్టడం ఏంటి అని విమర్శించారు. పొరపాటున తన తమ్ముడు తప్పు చేశాడని నిరూపిస్తే స్వయంగా తానే పోలీసు స్టేషన్ కు తీసుకువస్తానని తెలిపారు. వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలపై రేపు కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. బస్టాండ్ కూల్చి వేతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా ఉంటామని అన్నారు.

Read Also : పెరుగు రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel