Pawan Kalyan : చంద్రబాబు బాటలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టార్గెట్ వైసీపీ..!

Pawan Kalyan : Pawan Kalyan targets ycp and follow with chandrababu naidu Route
Pawan Kalyan : Pawan Kalyan targets ycp and follow with chandrababu naidu Route

Pawan Kalyan : చంద్రబాబు బాటలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కీలక అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో అధికార వైసీపీ పార్టీని ఇరుకున పెట్టాలంటే విశాఖ స్టీల్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని భావించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కేంద్రం వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని చెబుతోంది. నష్టాల నుంచి గట్టేక్కించాలంటే ప్రైవేటీకరణ తప్పనిసరి అని పేర్కొంది.అయితే, కేంద్రం నిర్ణయంతో ఏపీలో అధికార వైసీపీ పార్టీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. కేంద్రానికి ఎదురు తిరిగినా పెద్దగా ఫలితం లేదనేది వైసీపీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది.

Advertisement

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టి కేంద్రానికి పంపడం అనేది జనాలను డైవర్ట్ చేసే స్టంట్ అనేది అందరికీ తెలిసిందే.

దీని ద్వారా ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహాన్ని రాజకీయ నాయకులు దారి మళ్లిస్తుంటారు. తాజాగా ఏపీ ప్రజలను కూడా వైసీపీ ప్రభుత్వం అదే విధంగా డైవర్ట్ చేస్తోంది. అయితే, మొన్నటివరకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్టీల్ ప్లాంట్ అస్త్రాన్ని వాడి ప్రజల్లో మైలేజ్ పొందడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం అదే బాటలో జనసేన అధినేత పవన్ కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నది కేంద్రం అని తెలిసినా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఏమి అనడం లేదు. కేంద్రంతో పవన్ మంచి ర్యాపోను మెయింటెన్ చేస్తున్నారు. పైగా ఏపీలో బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది.అందకే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పవన్ వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము కూడా వ్యతిరేకం అని వైసీపీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ప్రైవేటీకరణను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేస్తున్నారు.

అందుకోసం ఒక రోజు తన పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగనున్నట్టు తెలిపారు. ఇలాంటి దీక్షలు మొదట బాబు తీసుకొచ్చారు. పవన్ దీక్షతో అధికార వైసీపీ స్టీల్ ప్లాంట్ అంశంపై తప్పక స్పందించక పరిస్థితి ఏర్పడింది. లేనియెడల ప్రజల్లో వైసీపీపై నెగెటివ్ ఒపీనియన్ రావొచ్చు. రేపు పవన్ ఏం మాట్లాడ బోతున్నారు. వైసీపీ ఈ విషయంలో ఎలా ఇరకాటంలో పడవేయనున్నారనే దానిపై అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Read Also : TS BJP Strategy : కమలం గూటికి మరో ఉద్యమనేత.. తెర వెనుక రాజకీయం ఎవరిదో మరి? 

Advertisement