MLA Balineni : మంత్రివర్గంలో మళ్లీ చోటు కల్పించకపోవడంపై బాలినేని శ్రీనివాసరెడ్డి మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. కొత్త మంత్రి వర్గంలో పాత వారు ఒకరో ఇద్దరో కొనసాగుతారు అన్న దశ నుండి ఆ సంఖ్య ముగ్గురు, నలుగురు, ఐదారుగురు ఏకంగా పది దాటేసింది. 11 మంది పాత మంత్రులనే కొనసాగిస్తున్న జగన్.. బాలినేనికి మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు.
దీంతో మనస్తాపం చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. బాలినేనికి మంత్రివర్గంలో మళ్లీ చోటు కల్పించకపోవడంపై నిరసనగా మాగలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవికి వెంకటరెడ్డి రాజీనామా చేశారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి కొటారి రామచంద్రరావు రాజీనామా సమర్పించారు.
ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బాలినేనికి మరో సారి మంత్రిగా అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ తో… మంత్రిగా తొలగించడానికి నిరసనగా ఈ రాజీనామాలు కొనసాగుతున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డికి మద్దతుగా భవిష్యత్ కార్యాచరణపై మేయర్, కార్పొరేటర్లు సమావేశం కానున్నారు.
Read Also : MLA Mekapati Sucharitha : మంత్రి పదవి ఇవ్వలేదని ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా..!