Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

MLA Mekapati Sucharitha : మంత్రి పదవి ఇవ్వలేదని ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా..!

MLA Mekapati Sucharitha : మంత్రి వర్గంలో తనకు చోటు ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మా అమ్మ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని మాజీ హోంమంత్రి సుచరిత కుమార్తె రిషిత తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ.. ఆమె వైసీపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. వైసీపీలో రెడ్డికో న్యాయం, ఎస్సీలకో న్యాయం చేస్తారా అంటూ సుచరిత వర్గీయులు భగ్గుమన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ... Read more

By Vinod Kumar

Published on: April 11, 2022 10:05 AM

Updated on: April 11, 2022 10:59 AM

MLA Mekapati Sucharitha :

---Advertisement---

MLA Mekapati Sucharitha : మంత్రి వర్గంలో తనకు చోటు ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మా అమ్మ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని మాజీ హోంమంత్రి సుచరిత కుమార్తె రిషిత తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ.. ఆమె వైసీపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. వైసీపీలో రెడ్డికో న్యాయం, ఎస్సీలకో న్యాయం చేస్తారా అంటూ సుచరిత వర్గీయులు భగ్గుమన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Mekapati Sucharitha
mla mekapati suharitha resign as mla

అయితే మంత్రి పదవి రాలేదని అసంతృప్తికి లోనైన బాలినేని శ్రీనివాస రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించిన సజ్జల.. ఎస్సీ మహిళ అయిన మేకపాటి సుచరిత కుటుంబీకులను కలిసే అవకాశం కూడా ఇవ్వకపోవడం న్యాయం కాదంటూ మండిపడ్డారు. సుచరితకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంపై గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా నేతలు, కార్యకర్తలు ఆదివారం గుంటూరులో ఆందోళనకు దిగారు. అంతకు ముందు సుచరిత ఇంటి ముందు బైఠాయించి… సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం లాడ్జి సెంటరు ప్రధాన రహదారిపై టైర్లు తగుల బెట్టి ట్రాఫిక్‌ను నిలిపివేసి ఆందోళన చేశారు.

Read Also : KGF2: ఆర్ఆర్ఆర్ సినిమాకంటే కేజీఎఫ్2 నిర్మాతకే లాభమెక్కువా..?

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.