Jr NTR Nara Lokesh : తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రి నారా లోకేష్ ను తెలుగు తమ్ముళ్లు వద్దనుకుంటున్నారట. కారణం అతడు డైలాగుల్లో స్పీడు చూపించడం లేదని తమ్ముళ్లు భావిస్తున్నారట. లోకేష్ ను కాదని వారు నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ను కోరుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో లోకేష్ తెర వెనుక పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చాలానే కృషి చేశారనే టాక్ ఉంది. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు లోకేష్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అతడిని మండలికి పంపారు. కానీ అనూహ్యంగా 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయింది.
లోకేష్ కూడా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి లోకేష్ ఇంటికే పరిమితమయ్యారు. అధికార వైసీపీకి ఆయన సరైన కౌంటర్లు వేయలేకపోతున్నారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఒకే ఒక ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతల్ని తన భుజాన వేసుకున్నారు.
ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు కూడా తెలుగు తమ్ముళ్లను అట్రాక్ట్ చేశాయి. దీంతో ఎన్టీఆర్ వస్తే తిరిగి టీడీపీ గాడిన పడుతుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం పార్టీని తన చేతిలోకి తీసుకునే ఆలోచన తనకు లేదని చెప్పారు. తాను సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ పెడతానని పేర్కొన్నారు.
ఈ ప్రకటనతో తెలుగు తమ్ముళ్లు కాస్త ఢీలాపడినా కానీ ప్రస్తుతం పార్టీ ఉన్న గడ్డు పరిస్థితుల్లో వారు మరలా ఎన్టీఆర్ వైపు చూస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం తన తర్వాత పార్టీలో లోకేష్ మాత్రమే బాస్ గా ఉండాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి భవిష్యతులో ఏం జరుగుతుందో…
Read Also : Kothagudem Raja Ravindra: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో కోటి గెల్చిన కొత్తగూడెం పోలీస్..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world