TDP Leaders : ఏపీలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నస్తోంది. ఇందుకోసం సాహసోపేతమైన నిర్ణయాలకు కూడా ఆ పార్టీ వెనుకాడేది లేదు. 40 ఏళ్ల క్రితం 1982లో పార్టీ ప్రారంభించిన తొలినాళ్ల వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చెప్పిన మాటనే ఇప్పుడు చంద్రబాబు ఆచరణలో పెడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎక్కువ అయ్యాయరని.. దీని వల్ల అభివృద్ధి కూడా ఆఘిపోయిందని నాడు ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి యువ నాయకత్వం కావాలని పిలుపునిచ్చారు. దీంతో నాడు ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎంతో మంది యువత రాజకీయాల్లోకి వచ్చారు.
అయితే నాడు రాజకీయ ఆరంగ్రేటం చేసిన వారిలో చాలా మంది తమ వారసులను తీసుకువచ్చారు. కొన్ని నియోజక వర్గాల్లో మాత్రం ఇప్పటికీ సీనియర్ల హవానే కొనసాగుతోంది. దీంతో తమకు ఎప్పటికీ అవకాశం రాజనే అనుమానంతో పలువురు నేతలు పార్టీల్లోకి వెళ్లిపోయారు కూడా. ఈ నేపథ్యంలో టీడీపీలో జూనియర్ల కంటే కూడా.. సీనియర్ల శాతమే ఎక్కువగా ఉంటుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే టీడీపీ కూడా రాబోయే రోజుల్లో మరో కాంగ్రెస్ పార్ట అవుతుందనే అభిప్రాయం ఇప్పటికీ వెల్లడవుతోంది. దీంతో పార్టీకి యువరక్తం ఎక్కించేందుకు అధినేత చంద్రబాబు సిద్ధం అయ్యారట.
Read Also : Raksha Bandhan : చిరుత పులికి రాఖీ కట్టిన మహిళ.. వీడియో వైరల్!