...

Pawan Kalyan : ఆ రెండు పార్టీలపై పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. ఏపీ రాజకీయాల్లో ఇదే టాపిక్..!

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ రెండు పార్టీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పటికీ కూడా వైసీపీతో, కాంగ్రెస్‌తో కలిసి నడిచే ప్రసక్తే లేదని పవన్ స్పష్టం చేశారు. దేశంలోనే కాదు.. రాష్ట్రంలోనూ మూడో ప్రత్యామ్నాయం అనేది తప్పక ఉండాలన్నారు.

Pawan Kalyan Shocking Comments on TDP And Ysrcp Alliance in AP Elections
Pawan Kalyan Shocking Comments on TDP And Ysrcp Alliance in AP Elections

వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించిన కోవర్టుల కారణంగా అన్నయ్య చిరంజీవి పార్టీని నిలబెట్టుకోలేకపోయారని పవన్ వివరించారు. ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే ఇప్పుడు అదే ప్రత్యామ్నాయంగా ఉండేదన్నారు. ఎవరైనా తనను పార్టీలోకి రమ్మంటే రాను పొమ్మన్నానంటూ పవన్ తెలిపారు. ఏ సీఎంలకు తాను భయపడేది లేదని జనసేనాని చెప్పారు.

Pawan Kalyan : కూటమిపై జనసేన క్లారిటీ.. 

తిరుపతిలో ఆదివారం (ఆగస్టు 26)న పవన్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తాను ఎవ్వరికీ భయపడేది లేదన్నారు. తన ఆస్తులు లేకపోయినా నిలబడతానని స్పష్టం చేశారు. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ ఎక్కువగా టీడీపీతో కలిసి వెళ్తారంటూ ప్రచారం జరిగింది. దీనిపై చాలాసార్లు పవన్ బహిరంగంగానే మాట్లాడారు.

Pawan Kalyan Shocking Comments on TDP And Ysrcp Alliance in AP Elections
Pawan Kalyan Shocking Comments on TDP And Ysrcp Alliance in AP Elections

వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేలా పొత్తులపై సరైన నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీతో జతకట్టనున్నట్టు అనేక ఊహాగానాలు వినిపించాయి. తాజాగా పవన్ కామెంట్స్ సంచలనంగా మారాయి. పవన్ టీడీపీతో పొత్తు లేదనే విషయాన్ని పవన్ చెప్పకనే చెప్పేశారు.

Read Also : Ponguleti Srinivas : టీఆర్ఎస్ పొంగులేటి గుడ్‌బై చెప్పనున్నాడా.. నిజమెంత?