Ponguleti srinivas : తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది నేతలు బీజేపీలోకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికీ పలువురు నేతలు తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. ఆగస్టు 21వ తేదీన మునుగోడు బీజేపీ భారీ బహిరంగ సభ వేదికగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే ఈ సభకు హోం మంత్రి అమిత్ షా పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ్య చిత్రం మారుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి పలువురు బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు.
అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు రిసెప్షన్ తో మరింత చర్చ నడుస్తోంది. బుధవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు రిసెప్షన్ వేడుక ఖమ్మంలో అంగరంగ వైభవంగా జరిగింది. వందల ఎకరాల స్థలంలో, వందల కోట్ల ఖర్చుతో నిర్వహించారు. ఈ వేడుకకు లక్షలాది మంది అతిథులు తరలి వచ్చారు.
కానీ ఈ రిసెప్షన్ కు పంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇంత ఘనంగా జరిగిన వేడుకకు టీఆర్ఎస్ పార్టీ నేతలెవరూ కనిపించ లేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఎస్ఆర్టీపీ వైఎస్ షర్మిల సహా పలువురు నేతలు మాత్రమే హాజరయ్యారు. దీంతో ఈ టాపిక్ ఉప్పుడు హాట్ గా మారింది. పొంగులేటి బీజేపీకి వెళ్లడం వల్లే గులాబీ నేతలు హాజరవలేదని తెలుస్తోంది.
Read Also : TDP Leaders : వ్యూహం మార్చిన టీడీపీ నేత చంద్రబాబు, ఏం చేయనున్నారు?