Chandrababu : ఆ విషయం వివరించేందుకు స్వయంగా రంగంలోకి చంద్రబాబు…

Chandrababu : Chandrababu to explain People about his wife Bhuvaneshwari incident in AP Assembly
Chandrababu : Chandrababu to explain People about his wife Bhuvaneshwari incident in AP Assembly

Chandrababu : ఏపీ అసెంబ్లీలో తన భార్యకు జరిగిన అవమాన ఘటనను స్వయంగా చంద్రబాబే ప్రజలకు వివరించేందుకు బయటకు వస్తున్నారు. ఆయన ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే సభల్లో పాల్గొంటారని సమాచారం. ముందుగా ఆ పార్టీ సీనియర్ నేతలతో ఈ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. కానీ వాటికి సరైన బూమ్ రాకపోవడంతో స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి సభలకు హాజరు కావాలని చూస్తున్నారట.

ఇటీవల బాబు జరిపిని కడప, చిత్తూరు పర్యటనల్లో కూడా వైసీపీ నేతలు తన భార్య అయిన భువనేశ్వరి మీద చేసిన కామెంట్లను ఆయన ప్రజలకు వివరించారు. దాంతో పాటుగానే వరద సమీక్షలు చేశారు. ఇలా చంద్రబాబు చెప్పడం వలన అక్కడి ప్రజల్లో టీడీపీకి మంచి సానుభూతి వచ్చిందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేతలు ప్రజలకు సరైన రీతిలో వివరించడం లేదని అందుకోసమే చంద్రబాబు నియోజకవర్గాల్లో సభలు పెట్టి ఈ విషయాన్ని స్వయంగా వివరిస్తారని సమాచారం.

Advertisement

అసెంబ్లీ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు బయటకు వచ్చి మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తాను మరలా ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేశారు. ఈ శపథం పై అనేక మంది వైసీపీ నాయకులు నానా రకాలుగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో వైసీపీ దూసుకుపోతుంది.

తాను అన్న మాటను తేలిగ్గా వదిలేస్తే వైసీపీ పార్టీ మరింత దూకుడు పెంచుతుందని భావించిన చంద్రబాబు ఎలాగైనా సరే ఈ ఘటనను ప్రజలకు వివరించాలని చూస్తున్నారట. అలా చేయడం వలన ప్రజలకు తమ పార్టీపై సానుభూతి పెరుగుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ కూతురు అయిన నారా భువనేశ్వరి అంశమే ఈ సభల్లో ప్రత్యేకంగా ప్రస్తావనకు రానుంది.

Advertisement

Read Also : Subhalekha Sudhakar : శుభలేఖ సుధాకర్​‌పై షాకింగ్​ కామెంట్లు చేసిన అలనాటి స్టార్ హీరోయిన్ గౌతమి…

Advertisement