Virata Parvam First Review : విరాట పర్వం మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విరాటపర్వం మూవీని చూసిన సెలబ్రిటీలు సూపర్ అంటున్నారు. దగ్గుబాటి రానా, సాయి పల్లవిల పర్ఫార్మెన్స్ అదుర్స్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతు వచ్చిన విరాట పర్వం మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చేలా కనిపిస్తోంది. ఎట్టకేలకు ఈ మూవీ జూన్ 17న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. మూవీ రిలీజ్ ముందే చూసేసిన సెలబ్రిటీలు మూవీకి ఫుల్ మార్కులు వేసేస్తున్నారు. సెలబ్రిటీలు తమదైన శైలిలో ఫస్ట్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఈ మూవీలో మెయిన్‌గా ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయట.. 1990లలో తెలంగాణలోని పరిస్థితుల ఆధారంగా విరాట పర్వం టైటిల్‌తో తెరకెక్కించారు.

తెలంగాణలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉండే రోజులవి.. అదే నేపథ్యంగా ఎంచుకున్న మూవీలో రానా, సాయిపల్లవి నక్సలైట్లుగా కనిపించనున్నారు. రానా రవన్నగా నటించగా.. సాయిపల్లవి వెన్నెలగా తన పాత్రలో ఒదిగిపోయింది. దర్శకుడు వేణు ఊడుగుల సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాతగా సురేష్ బాబు నిర్మించగా.. సురేష్ బొబ్బిలి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందట.. నక్సలైట్లు ప్రధాన పాత్రల మధ్య ఎమోషనల్ సీన్లు కళ్లకు కట్టినట్టుగా చూపించారట.. మూవీలో క్లైమాక్స్‌లో రవన్న, వెన్నెల ఇద్దరూ చనిపోతారట.. అసలు సినిమాలో ఇదే హైలైట్ అంటున్నారు. విరాట పర్వం మూవీని చూసిన ప్రతి ప్రేక్షకుడు కన్నీళ్లు రాకుండా ఉండవు.. అంతబాగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు.
Virata Parvam First Review : విరాట పర్వం మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!
నేనే రాజు నేనే మంత్రి మూవీ తర్వాత పూర్తి స్థాయిలో హీరోగా రానా నటించిన మూవీ విరాట పర్వం.. రానా కెరీర్‌లో ఇదో మైలు స్టోన్ నిలిచిపోనుందట.. విరాట పర్వం మూవీని చూసిన సెలెబ్రిటీలు ట్విట్టర్ వేదికగా ఫస్ట్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. దాంతో విరాట పర్వం మూవీపై ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. విరాట పర్వం మూవీ ఫస్ట్ రివ్యూ ఇచ్చిన సెలబ్రిటీల్లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఒకరు.. ఈ సినిమాను చూసిన ఆయన.. అందులో ఇద్దరి ప్రేమకు ఒక బ్రిడ్జి ఉంటుంది. రవన్న పాత్రలో దగ్గుపాటి రానా, వెన్నెల పాత్రలో సాయిపల్లవి అద్భుతంగా నటించారు.
దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్షన్ సూపర్ అంటూ విజన్ స్టోరీ టెల్లింగ్ బాగుందని క్రిష్ తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. క్రిష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే.. DJ టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా విరాట పర్వం మూవీని చూశారట.. ఆయన చేసిన ట్వీట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అద్బుతమైన ఎమోషన్స్‌తో సాగే విరాట పర్వం మూవీకి పాజిటివ్ టాక్ నడుస్తోంది. విరాట పర్వం మూవీ రిలీజ్ అయ్యాక కూడా అదే పాజిటివ్ టాక్ ఉంటుందా? లేదో చూడాలి.
Love is the bridge between you and everything -Rumi
Take a bow dearest #Ravanna @RanaDaggubati & #Vennela @Sai_Pallavi92 U guys r fabulous in dis splendid Love Story #VIRATAPARVAM ❤️🔥
AdvertisementHats off @venuudugulafilm for ur vision n story telling. Congratulations & All the very Best💐 pic.twitter.com/lra9kYnrsf
— Krish Jagarlamudi (@DirKrish) June 16, 2022
Advertisement