Vijaya shanthi : సాయి పల్లవిపై విజయ శాంతి ఫైర్.. ఏమంటుందో తెలుసా?

Updated on: June 17, 2022

Vijaya shanthi : లేడీ పవర్ స్టార్ గా అందరి మన్ననలు పొందుతున్న సమయంలోనే ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలతో హిందుత్వ వాదులకు టార్గెట్ అయ్యారు నటి సాయి పల్లవి. అయితే విరాట పర్వం సినిమా విడుదలకు ముందు ఆమె చేసిన కామెంట్లపై లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన సీనియర్ నటి విజయ శాంతి స్పందించారు.

vijaya-shanthi-comments-on-virata-parvam
vijaya-shanthi-comments-on-virata-parvam

కశ్మీర్ పండిట్లపై దారుణ హత్యకు పాల్పడిన వారిని, గోవధ కోసం ఆవుల అక్రమ రవాణాకు పాల్పడే వారిని అడ్డుకున్న గోసంరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతుందో కాస్త ఆలోచిస్తే మనకే అర్థం అవుతుందని తెలిపింది. అలాగే డబ్బు కోసం దోపిడీ దొంగ ఎరినైనా కొట్టడం, తప్పు చేసిన పిల్లాడిని తల్లిదండ్రులు దండించడం ఏ విధంగా ఒకటవుతాయంటూ మండిపడింది.

ప్రస్తుతం మనం మాట్లాడే ప్రతి మాట క్షణాల్లోనే కోట్లాది మందికి చేరిపోతూ… ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకొని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. అందువల్లే మాట్లాడే టప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని విజయశాంతి వివరించింది. అలాగే ఆర్థిక లాభాల ఆసక్తితో ఉన్న నిర్మాణ సంబంధితులు, కశ్మీర్ ఫైల్స్ పోలిక తెచ్చి, ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ఆ కథానాయికను సమస్యల్లోకి లాగినట్టుందేమో అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

Read Also : Virata Parvam Movie Review : ‘విరాట పర్వం’ మూవీ ఫుల్ రివ్యూ.. సినిమాకు ఇదే హైలెట్..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel