...

Rajamouli: రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్టుపై అప్డేట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్.. భయంకరమే అంటూ..!!

Rajamouli: మొన్ననే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని జోరు ఇంకా తగ్గనేలేదు. అత్యధిక వసూళ్లతో దుమ్ము రేపుతోంది. ఇంతలోనే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనే చర్చ మొదలైంది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత రాజమౌళి తీయబోయే సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.

ఆర్ఆర్ఆర్ హ్యాంగోవర్ దిగకముందే రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏమిటంటూ జోరుగా చర్చ నడుస్తోంది. మామూలుగా అయితే రాజమౌళి సినిమా సినిమాకు భారీగా గ్యాప్ తీసుకుంటారు. కానీ ఈసారి త్వరగానే తర్వాతి సినిమాను పట్టాలపైకి ఎక్కిస్తారని టాక్ నడుస్తోంది. రాజమౌళి తర్వాత సినిమా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఉంటుందని ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చేసింది. కానీ దాని తర్వాత ఏ అప్ డేట్ కూడా లేదు.

రాజమౌళి తర్వాతి ప్రాజెక్టుపై ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ అప్ డేట్ ఇచ్చారు. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ మహేశ్-జక్కన్న సినిమా వివరాలు వెల్లడించారు. రాజమౌళి మహేశ్ తో తీసే సినిమా చాలా అడ్వెంచరస్ గా ఉటుందని… ఇప్పటి వరకు ఎవరూ చూడని కొత్త కథ అని చెప్పారు విజయేంద్రప్రసాద్. దాంతో పాటు ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు. ఆ సినిమా కథ స్క్రిప్టు వర్క్ జరుగుతోంది… మెయిన్ గా అడవిని బేస్ చేసుకుని ఉంటుందని అన్నారు. షూటింగ్ కూడా అడవుల్లోనే తీయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ సినిమా మహేశ్ కు మర్చిపోలేని చిత్రం అవుతుందని చెప్పారు.