RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం RRR.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇకపోతే ఈ సినిమా థియేటర్ లో మంచి విజయాన్ని అందుకుని ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతుంది. ఈ క్రమంలోనే అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమాని చూస్తూ అందులో ఉన్న తప్పులను ఎత్తి చూపుతున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా రాజమౌళిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రస్తుతం ఒక సన్నివేశంలో జరిగిన పెద్ద తప్పు గురించి నెటిజన్లు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. మరి జక్కన్న చేసిన ఆ పెద్ద తప్పు ఏంటి అనే విషయానికి వస్తే… గోండు జాతికి చెందిన మల్లి అనే అమ్మాయిని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లినప్పుడు తనని విడిపించడం కోసం ఎన్టీఆర్ కోటలోకి పులులతో దాడి చేస్తాడు. ఈ దాడి చేసే సమయంలో రాజమౌళి ఒక పెద్ద తప్పు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ జంతువులను ఒకే ట్రక్ లో తీసుకెళ్లేటప్పుడు పులులు, జింక, నక్క వంటి జంతువులను ఓకే బోనులో ఉన్నట్టు చూపించారు. ఇక కోట వద్ద వాటిని వదిలి పెట్టగానే జింకల వెంట పులులు పరిగెడుతూ వేటాడుతాయి. అయితే ఓకే బోన్ లో వీటిని తీసుకు వచ్చిన సమయంలో పులులు జింకలను చంపేస్తాయి కదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. దాదాపు నాలుగు సంవత్సరాలపాటు ఈ సినిమా కోసం సమయం కేటాయించిన రాజమౌళి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ఈ తప్పులను ఎత్తి చూపుతూ రాజమౌళిని ట్రోల్ చేస్తున్నారు.
Read Also : RRR Ott release: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఇక పండగే!
Tufan9 Telugu News And Updates Breaking News All over World