Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆయన పై ప్రశంశలు కురిపించారు. భారతదేశం గర్వించదగ్గ సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి మన తెలుగువారు కావడం ఎంతో గర్వకారణంగా ఉంది అంటూ ఆయన రాజమౌళి గురించి ప్రశంసలు కురిపించారు.
రాజమౌళి సెంటిమెంట్ గురించి కూడా ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన హీరోలకు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత ఆ హీరోలు నటించిన తదుపరి సినిమాలు తప్పనిసరిగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఇలా ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోల విషయంలో నిరూపితమయింది.ఈ క్రమంలోనే ఈ విషయాల గురించి మెగాస్టార్ మరోసారి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఇలాంటి సెంటిమెంట్లను నమ్మనని, రాజమౌళి పై ఉన్న ఈ సెంటిమెంట్ ఆచార్య తుడివేస్తుందని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తదుపరి చిత్రమైన ఆచార్య సినిమా గురించి అభిమానులు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమా విషయంలో అలాంటి సందేహాలు అవసరం లేదని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు. మరి రాజమౌళి సెంటిమెంట్ ఆచార్య విషయంలో ఎలాంటి ఫలితాలను తీసుకు వస్తుందో తెలియాల్సి ఉంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World