Weekly Horoscope : ఈరోజు అంటే ఆగస్టు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈరెండు రాశుల వాళ్లకి ఈ వారం అంతా పరీక్షకాలం అని చెప్పారు. సహనం, ఓర్పే వారికి అన్ని రకాల లాభాలను చేకూరుస్తుందని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి.. ఓర్పుతో లక్ష్యాలను పూర్తిచేయాలి. కాలం అనుకూలంగా లేదు. ఉద్యోగంలో సౌమ్యంగా వ్యవహరించాలి. శాంతచిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి. సర్దుకుపోయే ధోరణి అవసరం. తగినంత మానవప్రయత్నం చేయండి, కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో అనుకున్న ఫలితం సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యనమస్కారం శుభాన్నిస్తుంది.
మిథున రాశి.. ఆర్థికాంశాలు బాగుంటాయి. ప్రతి అడుగూ ఆలోచించి వేయండి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. సహనాన్ని పరీక్షించే కాలమిది. శాంతస్వభావంతో పరిస్థితులను అర్థం చేసుకుని లక్ష్యాన్ని సాధించాలి. మిత్రుల సలహా అవసరం. పనుల్ని వాయిదా వేయవద్దు. నవగ్రహధ్యానం శుభప్రదం.
Read Also : Horoscope today : ఈరెండు రాశుల వాళ్లు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమీ..!