Daily Horoscope : ఈరోజు అంటే ఆగస్టు 16వ తేదీ మంగళ వారం పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈరెండు రాశుల వాళ్లు ఈరోజు అంతా చాలా ఫిజికల్ గా చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. వీలయినంత వరకు జాగ్రతత్గా ఉండాలని లేదంటే పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి.. మేష రాశి వాళ్లకు శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. నిరుత్సాహంగా అస్సలే ఉండకూడదు. శివ అష్టోత్తర శతనామావళఇ పారాయణం చేయడం చాలా మంచిది.
కన్య రాశి.. కన్య రాశి వాళ్లు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేస్తారు. మనసు చెడ్డ పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయనికి తగ్గ ఖర్చులు ఉంటాయి. తోటి వారితో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య దేవుడి ఆరాధన శుభప్రదం.
Read Also : Srikrishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏ రాశి వారు ఎలాంటి ప్రసాదం పెట్టాలో తెలుసా?