Daily Horoscope : ఈరోజు అంటే ఆగస్టు 18వ తేదీ మంగళ వారం పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈరెండు రాశుల వాళ్లకు ఈరోజు అంతా అదృష్టం కలిసి వస్తోందని తెలుస్తోంది. అయితే ఆ అదృష్టాన్ని పొందాలంటే ఏయే జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందో వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి.. మేష రాశి వాళ్లు ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభ ప్రదం. కాబట్టి రోజంతా శివుడి నామ స్మరణ చేస్తూ.. హాయిగా ఉండండి.
కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళఅలు ఏ పని తల పెట్టినా ఇట్టే పూర్తవుతుంది. ధర్మసిద్ధి ఉంది. కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివి తేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగల్గుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చాలా మంచిది.
Read Also : Srikrishna Janmashtami : శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏ రాశి వారు ఎలాంటి ప్రసాదం పెట్టాలో తెలుసా?