Daily Horoscope : ఈరోజు అంటే ఆగస్టు 21వ తేదీ ఆదివారం పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈరెండు రాశుల వాళ్లకు ఈరోజు అంతా అదృష్టం కలిసి వస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లు సొంతింటి కళను సాకారం చేస్కునే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి.. వృషభ రాశి వాళ్లు ఈరోజు విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగల్గుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగల్గుతారు. సొంత ఇంటి కళను సాకారం చేస్కునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గా ధ్యానం శుభప్రదం.
కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళ్లకు శుభ కాలం నడుస్తోంది. వీరి ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధి బలంతో కీలక వ్యవహారాల్లో సమయ స్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. అలాగే సొంతింటి కళను నెరవేర్చుకునందుకు అడుగులు ముందుకు వేస్తారు. ఈరోజు ఇల్లు కొనడం వంటివి చేసే అకాశం మరింత మెండుగా కనిపిస్తుంది. ఇష్ట దేవతారాఘన మంచిది.