Weekly horoscope: ఈరెండు రాశుల వాళ్లు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి.. లేదంటే?

Weekly horoscope: ఈ వారం అనగా ఆగస్టు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఉద్యోగం విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఆ రెండు రాశుల ఏంటి, వారికి వచ్చే సమస్యలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి.. ఏకాగ్రతతో పనిచేయండి. తొందర వద్దు. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగం విషయంలో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఒత్తిడికి లోనవకుండా బాధ్యతల్ని నిర్వర్తించండి. ఆర్థిక వృద్ధి సూచితం. నూతన ప్రయత్నాలకు ఇది సమయం కాదు. అపార్థాలకు తావివ్వవద్దు. నవగ్రహశ్లోకాలు చదివితే శాంతి లభిస్తుంది.

Advertisement

మిథున రాశి.. ఉద్యోగ వ్యాపారాల్లో మనోబలంతో ముందుకెళ్లాలి. పట్టుదల, మితభాషణం, సమయస్ఫూర్తి అవసరం. అపార్థాలకు తావివ్వవద్దు. ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా బాగున్నప్పటికీ ఖర్చు విషయంలో జాగ్రత్త. పలు మార్గాల్లో సంపాదన ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి. మంచి ఆలోచనలు శక్తినిస్తాయి. ప్రయాణాల్లో లాభముంటుంది. ఆదిత్యహృదయం చదవండి, అవరోధాలు తొలగుతాయి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel