Horoscope : ఈ వారం అంటే జులై 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు.. ప్రధాన గ్రహాలైన రాహు, కేతు, గురు, శని గ్రహాల వల్ల 12 రాశుల వారి రాశి ఫలాల గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పలు విషయాలను తెలిపారు. ముఖ్యంగా ఈ రెండు రాశుల వారికి ఈ వారం ఉద్యోగం, వ్యాపారాల్లో తీవ్ర ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నట్లు స్పష్టం చేశారు. వారు ఎంత జాగ్రత్తగా ఉండే అంత మంచిదని తెలిపారు. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Horoscope : జులై 10 తేదీ 16 రెండు రాశుల వారికి తీవ్ర ఒత్తిడి..
మేష రాశి.. ఈ రాశి వారికి మిశ్రమ కాలం నడుస్తోంది. అయితే ఉద్యోగం, వ్యాపారంలో తీవ్ర ఒత్తిడి పెరగనుంది. పొరపాటు జరగకుండా చూస్కోవాలి. గొడవలకు చాలా దూరంగా ఉండాలి. వాదోపవాదాలతో కాలం వృథా చేయవద్దు. వ్యాపారంలోనూ పలు సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తాయి. కుటుంబ సబ్యులతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలి. దుర్గాస్తుతి మేలు చేస్తుంది.
మిథున రాశి.. ఈ రాశి వారికి కోరికలు నెరవేరుతాయి. కానీ ఒత్తిడి వెంటాడుతుంది. సరైన ప్రణాళికలతో పనులు చేసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆవేశ పరిచే వారు మీ వెంటే ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీస్కోవడం మంచిది. అలాగే సంఘర్షణాత్మక స్థితి గోచరిస్తుంది. అపార్థాలకు అస్సలే తావివ్వవద్దు. నవగ్రహ శ్లోకాలు చదవడం వల్ల మనోబలం పెరుగుతుంది.
Read Also :Horoscope : ఈ రెండు రాశుల వాళ్లకు ఈ వారమంతా పట్టిందల్లా బంగారమే.. చూస్కోండి!