Horoscope : ఈరోజు అనగా జులై 14వ తేదీన ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రాశుల వారికి చాలా ఆటంకాలు ఎదురు కాబోతున్నాయట. అలాగే అవసరానికి సాయం కూడా బాగానే అందుతుందట. అయితే ఆ రాశులు ఏంటోమ మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి.. మేష రాశి వాళ్లకు నేడు మిశ్రమ కాలం నడుస్తోంది. ఆటంకాలు అధికంగా పెరిగే అకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాదండోయ్ ముఖ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరి చేరనీయ వద్దు. బంధువుల సహకారం అందుతుంది. వారితో గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది.
వృషభ రాశి.. వృషభ రాశి వాళ్ల ఉత్సాహంగా పని చేస్తే గొప్ప వాళ్లు అవుతారు. ఆజాగ్రత్త అస్సలే వద్దు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సాయం అందుతుంది. అవసరానికి మించి ఖర్చు కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో శత్రువులను కూడా కలుపుకొని పోవడం మంచిది. హనుమత్ ఆరాధన శుభప్రదం.