Horoscope : ఈ రెండు రాశుల వాళ్లకు ఈ వారమంతా పట్టిందల్లా బంగారమే.. చూస్కోండి!

Horoscope : ఈ వారం అనగా జులై 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ రెండు రాశుల వాళ్లకు చాలా బాగుంది. వారు ఏ పని చేసినా అందులో లాభాలే కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశులు ఏంటి.. అందులో మీరు ఉన్నారా లేదో తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే. ఓ సారి లుక్కేయండి మరి.

Advertisement

Horoscope :  రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమే…


వృషభ రాశి
.. వృషభ రాశి వాళ్లకు అనేక శుభ ఫలితాలు కల్గబోతున్నాయి. గృహ, భూ, వాహన యోగాలు ఉన్నాయి. మనోబలం ఓర్పును పెంచుతుంది. అలాగే ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థికంగా చాలా మెరుగపడతారు. ఆశించిన ఫలితం వస్తుంది. పట్టుదలగా పినచేసి ఉద్యోగం, వ్యాపారాల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. లక్ష్మీ దేవి ఆరాధన చాలా మంచిది.

కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళ్లకు శుభ యోగం ఉంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. బాధ్యతలను ధర్మ బద్ధంగా నిర్వర్తించాలి. ఆనందించే అంశం ఉంది. పట్టు విడుపుతో పనిచేయండి. అధికార యోగం సూచితం. ధనధాన్య లాభం ఉంటుంది. ఆవేశ పరిచే సంఘటనలు ఉన్నాయి. చాకచక్యంగా బయట పడాలి. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. సూర్యస్తుతి మేలు చేస్తుంది.

Advertisement

Read Also : Gold prices today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Advertisement