South Heroes: తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది స్టైల్ ఐకాన్స్ ఉన్నారు. వారు హీరోయిజంలోనే కాదు.. మోడలింగ్‌లోనూ వారు రప్ఫాడిస్తున్నారు. ముఖ్యంగా కుర్ర హీరోలు అయితే స్టైలింగ్ స్టేట్‌మెంట్స్ పాస్ చేస్తున్నారు. అందులో సౌత్ హీరోలే ఎక్కువగా ఉన్నారు. అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అదిరిపోయే ఫాలోయింగ్‌తో రప్ఫాడిస్తున్నారు. అంతేకాదు వాళ్ల స్టైలింగ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా వెడ్డింగ్ సీజన్ నడుస్తుండటంతో స్టైలింగ్ ఐకాన్స్‌లా మారి.. ఈ ముగ్గురు హీరోలు ఇచ్చిన ఫోజులు సోషల్ ఇండియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బయటికి వచ్చిన వాళ్ల ఫోటోలు చూసి అంతా ఫిదా అవుతున్నారు.
Allu Sirish: అల్లు శిరీష్ కింద నుండి పై వరకు అంతా తెలుపు వర్ణపు డిజైన్స్‌లో మెరిసిపోతున్నాడు. ముఖ్యంగా వైట్ చుడిదార్, దుప్పట్టా కాంబినేషన్‌లో వేసుకున్న వైట్ షర్వానీ పెళ్లికి పర్ఫెక్ట్ మ్యాచ్ అంతే. ఈ స్టైల్‌లో పెళ్ళికి వెళ్తే కచ్చితంగా అక్కడున్న అమ్మాయిలంతా అతన్నే చూస్తారేమో..? అనేలా ఉన్నాడు. ఈ డ్రెస్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇంకా డీటైలింగ్ వెళ్తే గోల్డెన్ కప్స్, అలాగే కాలర్స్ కూడా గోల్డ్‌లోనే ఉన్నాయి. బ్రౌన్ కలర్ షూస్‌తో పెళ్లి కొడుకులా మెరిసిపోతున్నాడు శిరీష్. ఈ పెళ్లి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిప్పుడు.
Dulquer Salmaan: యూత్ స్టైల్ ఐకాన్స్‌లో దుల్కర్ సల్మాన్ కూడా ఉంటాడు. ఆయన వేసుకున్న వైట్ కలర్ చుడిదార్ కాంబినేషన్‌లో ఉన్న మెరూన్ కలర్ షర్వాని అదిరిపోయింది. దానికి గోల్డెన్ బటన్స్ మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఇది కూడా పర్ఫెక్ట్ వెడ్డింగ్ క్యాస్ట్యూమ్. ఈ డ్రెస్‌లో ప్రతీ చిన్న డిటైలింగ్ ఆకట్టుకుంటుంది. నీట్ కర్చీఫ్, గోల్డెన్ బటన్స్, ఐబాల్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి.
Vijay Deverakonda: లైగర్ విజయ్ దేవరకొండ అంటేనే స్టైల్ ఐకాన్. పైగా ఈయన స్పెషల్ డిజైనర్ వేర్ వేసుకుంటే మాటలుండవు. వైట్ కుర్తా, వైట్ చుడిదార్ కాంబినేషన్‌లో పింక్ షర్వానిలో అదిరిపోతున్నాడు విజయ్ దేవరకొండ. ఇది నిజంగా గేమ్ ఛేంజర్ లుక్‌లా ఉంది. ఇది కచ్చితంగా ఫ్యాషన్ వరల్డ్‌లో సంచలనమే. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఈ లుక్ చూసి ఫిదా అవుతున్నారు. విజయ్‌లా స్టైల్ అప్ అవుతున్నారు. వీరే కాదు సౌత్‌లోని మరికొందరు హీరోలు.. ఇలా మేకోవర్ అయి.. మోడలింగ్‌లోనూ సంచలనం సృష్టిస్తున్నారు.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world