Karthika Deepam March 22 Today Episode :బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు మంచి రేటింగ్ దక్కించుకుంటుంది. ఈ సీరియల్లో వంటలక్క డాక్టర్ బాబు చనిపోయిన తర్వాత కథ ఎలా మలుపు తిరుగుతుంది అనే కుతూహలం ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో ఉండిపోయింది. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు మరణించడానికి కారణమైన హిమ ఉన్నచోట తాను ఉండని సౌర్య ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇలా బయటకు వెళ్ళిన సౌర్య సినిమాపై ప్రతీకారంతో జ్వాల అని పేరు మార్చుకుంటుంది.
ఇక హిమ సౌర్య పుట్టినరోజు కావడంతో సౌందర్య సౌర్య, హిమకు రెండు కేకులు తెప్పించి సెలబ్రేషన్స్ చేస్తారు. ఇక ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రేమ్ తో సౌందర్య మాట్లాడుతూ మీరైనా మీ అమ్మ నాన్నలను కలపొచ్చు కదా అంటూ బాధపడుతుంది. ఇక హిమ పుట్టినరోజు వేడుక కోసం రెండు కేకులు తేప్పించడంతో పుట్టినరోజు వేడుకలకు వచ్చిన వారందరూ మరొక కేక్ ఎవరికి అని అడగగా… మా పెద్ద మనవరాలు సౌర్య కోసమని సౌందర్య చెప్పడంతో అక్కడికి వచ్చిన వారు సౌర్య గురించి ఆరా తీయడంతో సౌందర్య బాధపడుతుంది.
ఇక ఆటోడ్రైవర్ గా స్థిరపడిన జ్వాల (సౌర్య)పుట్టినరోజు కావడంతో ఆటో స్టాండ్ డ్రైవర్లు అంతా కలిసి తనతో కేక్ కట్ చేయించాలని చూస్తారు. అయితే తన పుట్టిన రోజున కేక్ కట్ చేయడానికి సౌర్య నిరాకరిస్తుంది. తన కేక్ కట్ చేయమని చెప్పడంతో డ్రైవర్లు అందరూ బతిమిలాడి తనతో కేక్ కట్ చేస్తారు. ఇక దొంగతనం కేసులు జైలుకు వెళ్లిన చంద్రమ్మ ఇంద్రుడు జైలు నుంచి బయటకు వస్తారు.అయితే ఇలా బయటకు వెళుతూ వెళుతూ ఓట్టి చేతులతో వెళ్ళడం ఎందుకని భావించిన వాళ్ళు జైలర్ పర్స్ కొట్టేస్తారు. అలా పర్స్ కొట్టేయడం జ్వాల చూడటంతో వారిద్దరు తిరిగివెళ్ళి జైలర్ కు పర్స్ ఇస్తారు.
ఇక వీరిద్దరూ దొంగతనం చేయడంతో జైలర్ ఇలాంటి వారి కడుపున నువ్వు ఎలా పుట్టావ్ అమ్మా అంటూ జ్వాలను పొగుడుతారు. ఈసారికి వదిలేయండి వీళ్ళని నేను మార్చుకుంటా అంటూ జ్వాలా వాళ్ళని తీసుకుని వెళుతుంది. అలా వెళ్తున్న సమయంలో జైలర్ నా ఫ్రెండ్ ఒకడు జూబ్లీహిల్స్ లో ఉన్నారు. వాడికి పని వాళ్ళు కావాలి వీరిద్దరిని అక్కడ చేర్పించమ్మా అంటూ అతని ఫోన్ నెంబర్ ఇస్తాడు. బహుశా వాళ్ళిద్దరినీ స్వప్న భర్త ఇంటికి పనికి పంపించనునట్లు తెలుస్తోంది.ఇలా ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తికాగా తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also : Karthika Deepam: రౌడీలా మారిన సౌర్య.. డాక్టర్ గా హిమ..?