Karthika Deepam March 15th Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. కార్తీక్, దీప లకు సౌందర్య కుటుంబం పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. మరొకవైపు మోనిత కూడా కార్తీక్ ఫోటో కి పిండ ప్రదానం చేస్తూ ఉంటుంది. సౌందర్య కుటుంబం కార్తీక్ పిండాన్ని నదిలో వదులుతూ గుండెలవిసేలా రోదిస్తు ఉంటుంది.
మరొకవైపు మోనిత కార్తీక్ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత తన బాబుని, తనకున్న ఆస్తి అంతా లక్ష్మణ్ చేతిలో పెట్టి బస్తి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడుతుంది. తన బాబు ని కూడా వారికే ఇచ్చేసి ఆ డబ్బులతో తన బాబుని డాక్టర్ ని చేయమని చెబుతుంది.
అప్పుడు మోనిత ఏడ్చుకుంటూ తన బాబుని అరుణ చేతిలో పెట్టి ఎంతో నిరాశతో బాధతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు సౌందర్య కుటుంబం కార్తీక్ దీపం ల ఫోటోలు చూసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటారు. సౌందర్య మాత్రం కార్తీక్ కార్తీక్ అంటూ ఆనందరావు ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది.

మరొకవైపు హైదరాబాద్ కు చేరుకున్న హిమ తన నానమ్మ కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి ఆనందంతో పరుగులు తీస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే చిక్ మంగళూరు లో జరిగిన విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది.
ఇంతలో సౌర్య వచ్చి హిమ ఫోటోని బయటకు విసిరేస్తుంది. అదే సమయంలో ఇంటికి తిరిగి వస్తున్న హిమ తన ఫోటోను చూసి ఆశ్చర్యపోతుంది. అది అమ్మానాన్నలను మింగేసే రాక్షసి అది నా కంటికి కనిపించే దానికి వీలు లేదు అంటూ సౌర్య అన్న మాటలు హిమ విని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam: కోపంతో రగిలి పోతున్న శౌర్య.. హిమ పరిస్థితి ఏంటి..?
- Karthika Deepam june 27 Today Episode : నిరుపమ్ చేసిన పనికి షాక్ అయిన హిమ.. దగ్గరవుతున్న జ్వాలా, సౌందర్య..?
- Karthika Deepam: హిమ, సౌర్యను కలిపే ప్రయత్నంలో ఇంద్రుడు.. కార్తీక్ ని దక్కించుకోవాలి అనుకుంటున్న చారుశీల?
- Karthika Deepam July 7 Today Episode : బాధతో కుమిలిపోతున్న సౌర్య.. నిరుపమ్ కి,సౌర్యకి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చిన హిమ..?













