Karthika Deepam: కోపంతో రగిలి పోతున్న శౌర్య.. హిమ పరిస్థితి ఏంటి..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

జరిగినదంతా తలుచుకొని హిమ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు చంద్రమ్మ భోజనం తీసుకొని వచ్చి తిను అమ్మ నా తల్లి కదు అని బ్రతిమలాడగా అప్పుడు హిమ మీకు దండం పెడతాను నన్ను హైదరాబాద్ కి తీసుకెళ్లండి అని అంటుంది. దీనితో చంద్రమ్మ దంపతులు ఆలోచనలో పడతారు.

మరొకవైపు సౌర్య పచ్చబొట్టు పొడిపించుకున్న హిమ పేరును తీసేయాలి నానమ్మ,దాని గుర్తులు ఏవి ఉండకూడదు అని అంటూ బాధపడుతూ ఉండగా అప్పుడు సౌందర్య సౌర్య ని ఓదారుస్తుంది. ఇంతలో సౌందర్య ఇంటికి బస్తీవాసులు వస్తారు. అప్పుడు వారణాసి మాట్లాడుతూ పాపం హిమమ్మా అని అనగా అప్పుడు సౌర్య ఆపు వారణాసి అంటూ అతనిపై కోప్పడుతుంది.

Advertisement

మా అమ్మ నాన్న లను చంపేసిన రాక్షసి హిమ అంటూ బస్తీవాసులకు చెబుతుంది సౌర్య. అప్పుడు బస్తీవాసులు మాకు ఎవరున్నారు అని బాధ పడుతూ ఉండగా మీకు అండగా మేముంటాం అని సౌందర్య మాట ఇస్తుంది. మరొకవైపు చంద్రమ్మ దంపతులు హిమ ను ఎలాగైనా హైదరాబాద్ కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి దగ్గర డబ్బులు చూసి డబ్బులు దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తారు.

చంద్రమ్మ ఒక వ్యక్తిని మాటల్లో పెట్టగా వెనుక వైపు నుంచి చంద్రమ్మ భర్త ఆ డబ్బులు దొంగలిస్తాడు. మరొకవైపు సౌందర్య కుటుంబం చనిపోయిన కార్తీక్, దీప, హిమ లకు నది ఒడ్డున కర్మకాండలు జరిపిస్తూ ఉంటారు.ఆ తరువాత సౌర్య హిమ గుర్తులు ఇంట్లో ఏవి ఉండకూడదు అంటూ హిమ ఫోటోని బయటకు విసిరేస్తుంది.

Advertisement

ఇంతలో సౌందర్య ఇంటికి వస్తున్న హిమ అది చూసి చాలా బాధపడుతుంది. అదే క్రమంలోనే హిమ అమ్మ నాన్న లను చంపిన రాక్షసి ఇప్పటినుంచి దాని పేరు ఎవరైనా తలచుకున్నా కూడా అని నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను అని చెబుతోంది. ఆ మాటలు విన్న హిమ అక్కడినుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement