...

Karthika Deepam: రౌడీలా మారిన సౌర్య.. డాక్టర్ గా హిమ..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

హిమ పై కోపంతో సౌర్య ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లి పోతుంది. అంతేకాకుండా నన్ను వెతక వద్దు లెటర్ లో రాసింది. సౌర్య కోసం సౌందర్య కుటుంబం అంతా వెతుకుతూ ఉంటారు. కానీ సౌర్య మాత్రం సౌందర్య వాళ్ళకి కనిపించకుండా దూరంగా వెళ్లి పోతుంది.

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగి వెళ్తుంది. దారిలో అనాధ పిల్లలు కనిపించడంతో సౌర్య అక్కడ జరుగుతుంది. సౌమ్యకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ని సూర్య దొంగ భావించడంతో అతడిని రాయితో విసిరి అక్కడినుంచి పారిపోతుంది. మరొకవైపు చంద్రమ్మ ఒక కిరాణా షాప్ దగ్గర దొంగతనం చేస్తుండగా అది సౌర్య వెనుకల వైపు నుంచి చూస్తుంది.

ఇప్పుడు సౌర్య చంద్రమ్మ ను భయపెడుతూ ఆమె దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఇంతలో ఇంద్రుడు ఏం జరిగింది అని అడగగా అప్పుడు ఇంద్రమ్మ జరిగినదంతా వివరిస్తుంది. మళ్లీ అక్కడికి వచ్చిన సౌర్య చంద్రమ్మ దంపతులను బెదిరించి ఆ డబ్బులు కూడా తీసుకొని అనాధ పిల్లలకు ఇస్తుంది.

ఇక హిమ , సౌందర్య లు తనను వెతుకుతూ ఉండటం చూసిన సౌర్య బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే కొద్ది సంవత్సరాల తరువాత హిమ, సౌర్య లు పెద్ద వాళ్ళు అయ్యి ఉంటారు. సౌందర్య ఇంట్లో హిమ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి.

ఇక అక్కడికి సౌందర్య మనవడు నిరూపమ్ వచ్చి హిమ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతాడు. మరొకవైపు ఆటో డ్రైవర్ గా మారిన సౌర్య ఒక వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతన్ని కొడుతుంది. సౌర్య పెద్దగా అయినా కూడా హిమ పై కోపం తగ్గదు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఎం జరుగుతుందో చూడాలి మరి.