Guppedantha Manasu ఫిబ్రవరి 01 ఎపిసోడ్ : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రిషి ,వసుధార జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసుధార జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి జగతి భోజనం తీసుకుని రావడంతో, ఎందుకు వచ్చావు వసుధార అనగా రిషి నేను జగతిని అనడంతో లోపలికి రండి అంటాడు రిషి. అప్పుడు ఎందుకు మేడం వసుధార మళ్లీ కాలేజీకి వచ్చింది నన్ను డిస్టర్బ్ చేయాలనుకుంటుందా అని అనడంతో నీకు ఎంత తెలుసు నాకు కూడా అంత మాత్రమే తెలుసు రిషి అంటుంది జగతి. మేడం మీరు నాకు ఒక సహాయం చేస్తారా అని రిషి అడగగా ఏంటి రిషి అనడంతో వసుధారని ఎంత ప్రయత్నించినా మర్చిపోలేక పోతున్నాను మరిచిపోయేలాగా ఏవైనా ఉంటే చెప్తారా అని అంటాడు.
ఆ మాటలు విన్న జగతిలోలోపల బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు జగతి ఒకటి అడుగుతాను చెప్పు రిషి నువ్వు వసుధారని కేవలం ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా మాత్రమే భావిస్తున్నావా, వసుధరపై నీకు ప్రేమ లేదా అనడంతో రిషి మౌనంగా ఉంటాడు. అయినా వసుధార పెళ్లి చేసుకుంది అక్కడే ఉండొచ్చు కదా మేడం మళ్ళీ ఎందుకు వచ్చింది అని అంటాడు. అప్పుడు రిషి మేడం మీరు నన్ను ఓదారుస్తున్నారా లేకపోతే జీవితంలో ఒంటరిగా ఉండడానికి మానసికంగా సిద్ధం చేస్తున్నారా అనడంతో, కాదు రిషి నువ్వు ధైర్యం ఎప్పటికీ కోల్పోకు అనగానే ధైర్యాన్ని కోల్పోలేదు మేడం నమ్మకాన్ని కోల్పోయాను అనడంతో జగతి మరింత బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు రిషిని ఎక్కువగా ఆలోచించద్దు ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి జగతి అక్కడి నుంచి వెళ్లిపోవడంతోరిషి,వసుధార జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత వసుధార నాకు రిషి సార్ కి మధ్య ఎన్నో గొడవలు వచ్చాయి ఎన్నోసార్లు పోట్లాడుకున్నాము అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రిషి వసుధార పంపిణీ మెసేజ్లు చూసుకుంటూ కనీసం నువ్వైనా వసుధార ఎలా మర్చిపోవాలో చెబుతావా అనుకుంటూ వసుధారకు అనుకోకుండా మెసేజ్ చేస్తాడు. అప్పుడు మెసేజ్ వసు ఆ మెసేజ్ చూసి ఏంటి రిషి సార్ ఇందులో ఏమీ రాయలేదు నాకు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నాడా అని ఆలోచించగా ఇంతలో చక్రపాణి అక్కడికి వచ్చి ఏంటమ్మా ఇంకా పడుకోలేదా అని అంటాడు.
గుప్పెడంత మనసు ఫిబ్రవరి 01 ఎపిసోడ్ : దగ్గరవుతున్న వసు రిషి..
సరే నాన్న రేపు ఉదయం మనం ఒక చోటికి వెళ్లాలి అనడంతో సరే అని చక్రపాణి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రిషి వసుధార జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రిషి బయటకు బయలుదేరగా అప్పుడు మహేంద్ర నేను కూడా వస్తాను అనడంతో సరే అని అంటాడు రిషి. అప్పుడు జగతి నేను కూడా వస్తాను రిషి అనడంతో ఏం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతాడు రిషి. ఏంటి మహేంద్ర ఏం చెప్పకుండా వెళ్ళాడు అనగా మౌనం అర్ధాంగికారం అన్నాడు కదా సరే వెళ్దాం పద అని మహేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వసుధార చక్రపాణి అని పిలుచుకొని చెరువు దగ్గరికి అన్న నువ్వు ఇక్కడే కూర్చో నేను నా కోరికలను కాగితంపై రాసి పడవలు చేసి నీటిలో వదులుతాను అనడంతో సరే అంటాడు.
అప్పుడు వసుధారని నీళ్ల దగ్గరికి వెళ్లి పడవలు చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మహేంద్ర దంపతులు రిషి వస్తారు. ఏంటిది రిషి ఇక్కడికి పిలుచుకొని వచ్చావు అనడంతో పడవలు చేయడానికి అనగా అదేంటి విషయం అనడంతో మీకు అర్థం కాదు డాడీ మీరు ఇక్కడే ఉండని అని చెప్పి రిషి వెళ్లి పడవలు తయారు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రిషి, వసుధార ఒకరి మనసులో ఒకరు ఒకే విధంగా ఆలోచిస్తూ మళ్లీ దగ్గర అవ్వాలని కోరుకుంటూ పడవలపై వారి కోరికలు రాసి నీటిలో వదిలి దండం పెట్టుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు కళ్ళు తెరిచి చూడగా ఇద్దరి పడవలు ఒకచోట కలుసుకోవడంతో అది చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు రిషి,వసుధార లు ఒకరినొకరు చూసుకుంటూ ఆనంద పడుతూ ఉంటారు.
Read Also : Guppedantha Manasu జనవరి 31 ఎపిసోడ్ : దేవయానిపై సీరియస్ అయిన రిషి… సంతోషంలో వసుధార?