Guppedantha Manasu జనవరి 31 ఎపిసోడ్ : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గత ఎపిసోడ్లో దేవయాని వసుధార దగ్గరికి వెళ్లి గొడవ చేస్తూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో మీకు మీ నాన్నకు టికెట్స్ బుక్ చేస్తాను ఎక్కడికైనా వెళ్లిపోండి లేదా ఇద్దరికీ కలిపి ఏసీ కార్ బుక్ చేస్తాను కనిపించకుండా వెళ్లిపోండి అని అంటుంది. అప్పుడు వసుధర ఆ చెట్ని చించి విసిరి కొడితే కానీ మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్లరా అని అంటుంది. పదేపదే వెళ్లిపోండి అంటున్నావు ఇది గౌతమ్ ఫ్లాట్ అని అనడంతో ఇంతలో చక్రపాణి ఎక్కడికి వచ్చి ఇది రిషి సార్ ఇచ్చారు మేడం అని అంటాడు. రిషి ఇస్తాడు ఆయన సిగ్గు లేకుండా మీరు ఎలా తీసుకున్నారు అనడంతో మేడం మర్యాదగా మాట్లాడండి మీ భాషను మార్చుకోండి అని అంటుంది వసుధార.
ఇప్పుడు దేవయాని వసుధారతో వాదిస్తూ ఉండగా ఇంతలోనే రిషి రావడంతో రండి రిషి సార్ అని అంటాడు చక్రపాణి. దాంతో దేవయాని రిషి మొత్తం విన్నాడా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. పెద్దమ్మ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనడంతో అది కాదు రిషి,వసు ఇక్కడ ఎందుకు ఉంది అనగా అంతా మీకెందుకు పెద్దమ్మ ఆడడంతో దేవయాని షాక్ అవుతుంది. పెద్దమ్మ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏం మాట్లాడారో తెలియదు. వసుధార మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ తనకు తనకి సదుపాయాలు కల్పించడం మన బాధ్యత అని చెప్పి దేవయాని మాట్లాడుతున్న వినిపించుకోకుండా రిషి దేవయానని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అప్పుడు వసుధర రిషి సార్కు నా మీద ప్రేమ ఉంటే వెనక్కి తిరిగి చూస్తాడు చూస్తాడు అని మనసులో అనుకుంటుండగా అలాగే రిషి వెనక్కి తిరిగి చూడడంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది. తర్వాత దేవయాని, రిషి ఇద్దరు ఇంటికి వస్తారు. అప్పుడు దేవయాని రిషి ముందు మంచిగా నటిస్తూ ధరణి,రిషి రూమ్స్ క్లీన్ చేశావా రిషి వచ్చాడు వంటలు చేయి అంటూ హడావిడి చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటి మహేంద్ర అలా చూస్తున్నారు రిషి ఎలా వచ్చాడని అనుకుంటున్నారా మీకంటే ఎలాగో రెస్పాన్సిబులిటీ లేదు అంటూ మహేంద్ర వాళ్ళను ముందు తక్కువ చేసి మాట్లాడుతుంది.
Guppedantha Manasu january 31 Today Episode : రిషి సార్.. మీరు నిజంగా జెంటిల్మెన్…
ఎందుకు వదిన మా మీద లేనిపోని చాడీలు చెబుతున్నారు అని మహేంద్ర అనగా ఇప్పుడు దేవయాని దొంగ ఏడుపులు ఏడుస్తూ చూసావా రిషి చేయాల్సినవన్ని చేసి లాస్ట్ లో నన్ను నిందిస్తున్నారు అని అంటుంది. పెద్దమ్మ మీరు వసుధార దగ్గరికి వెళ్లడం తప్పు ఇంకొకసారి ఎక్కడికి వెళ్లొద్దండి దయచేసి నా విషయాలు కలగజేసుకోవద్దండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. అప్పుడు జగతి మహేంద్రా ఇద్దరు వెటకారంగా దేవయానికి థాంక్స్ చెప్పే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత వసుధర రిషితో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకొని రిషి సార్ మీరు నిజంగా జెంటిల్మెన్ కదా అని అనుకుంటూ ఉంటుంది. మీతో ఆనందంగా గడిపేక్షణాలు ఎప్పుడు వస్తాయో ఏమో అనుకుంటూ ఉంటుంది.
చక్రపాణి అక్కడికి వచ్చి ఏంటమ్మా బాధపడుతున్నావా అనగా ఎదురుచూస్తున్నాను నాన్న అని అంటుంది. అప్పుడు చక్రపాణి ఇందాక రిషి సార్ మాటలు విన్నావు కదమ్మా రిషి సార్ కళ్ళల్లో మాటలు నీ మీద కొండంత ప్రేమ కనిపించింది అనడంతో వసు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని అవును నాన్న అని అంటుంది. రిషి సార్ కి నిజం చెప్పేయొచ్చు కదా అమ్మ అనడంతో వద్దు నాన్న రిషి సార్ అంతట రిషి సార్ నిజం తెలుసుకోవాలి నేను చెప్తే మైండ్ వింటుంది కానీ నిజం తెలుసుకుంటే మనసు వింటుంది అని అంటుంది.
మరొకవైపు రిషి వసుధార పేర్లు పేపర్ మీద రాసి ఎందుకు వసుధార నా లైఫ్ లోకి వచ్చావు అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు రిషి. అప్పుడు వసుధర మెడలో తాళి గుర్తుకు రావడంతో ఇప్పుడు వసుధార మరొకరి భార్య నేను ఇలా ఆలోచించడం తప్పు అని అనుకుంటూ ఉంటాడు.