...

Guppedantha Manasu : భయంతో వణికిపోతున్న శైలేంద్ర…ముకుల్‌ ముందు నిజం చెప్పిన ధరణి!

Guppedantha Manasu : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ముకుల్ జగతి కేసుని డీల్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ గా వస్తాడు (జగతి మేడం స్టూడెంట్) రిషి వాళ్ళ ఇంటికి వస్తాడు. రిషి ముక్కులతో ఆరోజు ఇంట్లో నుంచి అమ్మ బయలుదేరడం నాకు అమ్మకు తప్ప ఎవరికీ తెలియదు.. అమ్మ నాకు మాత్రమే కాల్ చేసింది అలాంటిది బయట వాళ్లకు ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు అంటాడు రిషి. దానిదేముంది జగతి మేడం ఫోన్ ట్రాక్ లో ఉంచితే సరిపోతుంది కదా అంటాడు ముకుల్. నిజమే సార్ ముందు మన చుట్టూ ఉన్న వాళ్లను అవసరమైతే మన అనుకునే వాళ్లను విచారించుకుంటూ వెళ్తే బాగుంటుందేమో అంటుంది వసు.

నిజమే మేడం.. నిజానికి మా విచారణ పద్ధతి కూడా అలాగే ఉంటుంది. ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు ముందు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఇరుగు పొరుగు వారిని స్నేహితులని విచారిస్తాం అంటాడు ముకుల్. కానీ మీరు మా ఫ్యామిలీ వాళ్ళని విచారించవసరం పనిలేదు సార్ మేమంతా చాలా ప్రేమానురాగాలతో ఉంటా అంటుంది దేవయాని. అప్పుడు అత్తయ్య ఇప్పుడు చాలా కేసుల్లో ఇంట్లో వాళ్లే నేరస్తులుగా బయటపడుతున్నారు కదా అంటుంది వసు. అంటే ఏమిటి వసుధారని ఉద్దేశం జగతి మరణానికి మన ఇంట్లో వాళ్ళ కారణమంటావా అంటుంది దేవయాని అని కోపంగా“అయ్యో నేను అలా అనడం లేదు అత్తయ్య.. మనం తప్పు చేయకపోయినా మన ఆధారం చేసుకుని మన వెనుక గోతులు తీసే వాళ్ళు ఉంటారు కదా? అలాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు.. నేనైనా, మీరైనా, శైలేంద్ర గారైన కావచ్చు..

Guppedantha Manasu November 3rd Episode in telugu
Guppedantha Manasu November 3rd Episode in telugu

రాజ్యాల కోసం అన్నదమ్ములు యుద్ధాలు చేసిన చరిత్ర మనకు తెలుసు.. జగతి మేడం మరణం వెనక ఏ కారణం ఉందో ఏమో జరిగే ప్రతి తప్పు వెనక ఒక స్వార్థం ఉంటుంది కదా అంటుంది వసు. అప్పుడు ముకుల్ మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అంటాడు. ఎం ఎస్ ఆర్ మీద ఉంది అంటుంది వసుధార. ముకుల్ ఎవరు అతడు అంటాడు రెండు మూడు సార్లు కాలేజీ సొంతం చేసుకోవాలని ట్రై చేశాడు అప్పుడే తనకి వార్నింగ్ ఇచ్చాను.. మోసాలు చేసే వాడే కానీ అతడు ప్రాణం తీసే అంత పని చేస్తాడని నేను అనుకోవట్లేదు సార్ అంటాడు రిషి. అవును ఆ ఘటన లో మీరు కూడా ఉన్నారు కదా సమాచారం ఇచ్చారు అంటాడు ముకుల్ వసుధారతో అప్పుడు ధరణి కాల్ చేసిన విషయం గుర్తుకొస్తుంది కానీ చెప్పదు వసుధార. నా సిక్స్త్ సెన్స్ చెప్పింది ఏదో ప్రమాదం జరుగుతుందని అందుకే నేను మరో స్టూడెంట్ ని హెల్ప్ తీసుకొని అక్కడికి వెళ్లాను.

అప్పుడు రిషి పాండేకి నేనే లోకేషన్ చెప్పాను అంటాడు. అప్పుడు ముకుల్ రిషి గారి మీద అటాక్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటాడు. అప్పుడు ఫణీంద్ర భార్య మా ఆయన ఫారం నుంచి వచ్చినప్పటి నుంచి అంటుంది ధరణి. బిత్తర పోతాడు శైలేంద్ర, దేవయాని మీ ఆయన అంటే వీరే కదా అంటాడు ముకుల్. అప్పుడు ముకుల్ అనుమానంగా ఎదురుగా ఉన్న శైలేంద్రని చూస్తాడు. అలా చెప్తావ్ ఏంటి ధరణి పాపం తనకి వచ్చినప్పటి నుంచి వచ్చాడన్న సంతోషం కూడా లేకుండా మన సమస్యలన్నీ పంచుకుంటూ ఉన్నాడు కదా అంటుంది దేవయాని. తనకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు సార్ తన మాటలు పట్టించుకోకండి అంటూ కవర్ చేస్తాడు శైలేంద్ర. అప్పుడు అమాయకురాలు కాబట్టే నిజం చెప్పింది అంటుంది వసుధార నేను కూడా అదే చెబుతున్నాను వసుధార నేను వచ్చినప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయని.. నేను రోజు తన ముందు బాధపడడం విని మాట్లాడింది అంతే అంటాడు శైలేంద్ర కోపంతో.. జగతి మేడం ఫోన్ మాట్లాడేది మీరు ఎవరైనా చూశారా.

మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయా.. మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తే మేడం ఎవరో ఫాలో అయ్యారు. ఇదంతా ఎలా జరిగింది? మీలో మీకు తెలియకుండా ఎవరో శత్రువులు ఉన్నారు మొత్తంలో మొత్తం కనుక్కుంటాను. అప్పుడు శైలేంద్ర మీరు అలా అనకండి సార్ మా ఇంట్లో శత్రువులంటూ ఎవరూ లేరు మమ్మల్ని అనుమానిస్తే భూషణ్ ఫ్యామిలీనే అవమానించినట్టు అంటాడు. అప్పుడు రిషి అలా ఎందుకు అనుకుంటావ్ అన్నయ్య ఒక స్పెషల్ ఆఫీసర్ ముకుల్ గారు ఎన్నో కోణాలగా విచారణ చేస్తారు. మనం అందరం అతనికి సపోర్ట్ చేయాలి. అప్పుడు ఫణీంద్ర మంచిది సార్ నేరం ఎవరు చేసిన వదిలిపెట్టదు పైగా మీరు జగతి మేడం స్టూడెంట్ కాబట్టి ఈ కేసుని ఓ బాధ్యతగా తీసుకోండి అప్పగించి మంచి పని చేశాడు అంటాడు ముకుల్ తో. ఓకే సార్ జగతి మేడం ఫోన్ కాల్ లిస్ట్ కూడా తెప్పిస్తాను అలాగే మేడం కారు ఎవరు ఫాలో అయ్యారో కూడా సిసి టీవీ ఫుటేజ్ తీస్తాను.

Guppedantha Manasu November 3rd Episode in telugu
Guppedantha Manasu November 3rd Episode in telugu

మొత్తానికి తేల్చే తీరుతాను అని ముకుల్ చెప్పడంతో భయంతో వణికిపోతున్న  శైలేంద్ర, దేవయానికి .. ఇక రిషిదారులకు బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒంటరిగా కూర్చున్న రిషి దగ్గరికి వసు మల్లెపూలు ప్లేటు తీసుకొని వస్తుంది. ఏమీ ఆలోచిస్తున్నారు సార్ ఏమి లేదు వసు ముందే నీకు చెప్పలేదు కదా.ముకుల్ గురించి ముందే నీకు చెప్పలేదని నువ్వు ఫీల్ అవుతున్నావా అయ్యో అదేమీ లేదు సార్ అయినా మీరు కూడా సడన్గా ఈ డేటిషన్ తీసుకున్నారు కదా నేనెందుకు ఫీలవుతాను సార్.. మీరు ఏదైనా చేస్తే అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది మీరు ఎప్పుడు సరైన నిర్ణయమే తీసుకుంటారు.

మీరు ఏది చేసినా నాకు చెప్పాల్సిన అవసరం లేదు సార్ అంటుంది వసుధార. రిషి థాంక్యూ వసుధార నన్ను అర్థం చేసుకున్నందుకు అయ్యో ఎప్పుడు మిమ్మల్ని నేను అర్థం చేసుకుంటాను సార్.. ఏంటి సార్ అలా చూస్తున్నారు ఈ మల్లెపూలు చూసినప్పుడల్లా జ్ఞాపకాలు గుర్తొస్తాయి. బస్సుకి రిషి మల్లెపూలు కొనిచ్చిన సన్నివేశం గుర్తు చేసుకుంటూ ఇద్దరు రిషి వసు తో ప్రేమగా.. వస్తారా నీతో చాలా విషయాలు చెప్పాలి నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఈ అమ్మాయి నాకు చాలా కాలక్షేపం అనుకున్నా.. ఆ తర్వాత నీ మొండితనాన్ని చూసి ఈ అమ్మాయి చాలా పొగరు అనుకున్నాను.. ఆ తర్వాత నీ టాలెంట్ చూసి ఈ అమ్మాయి దగ్గర మంచి సబ్జెక్టు ఉంది అనుకున్నాను..

అని వసుకు రిషి చెపుతూ ఉంటాడు వసు నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు నాకు తోడుగా ఉండడం చూసి ఈ అమ్మాయి నాకు చాలా తోడుగా ఉంటుందనుకుంటున్నాను. ఇలా అనుకున్న ప్రతిసారి నేను నీ నువ్వు చూస్తాను వసుధార.. అప్పుడు నువ్వు ఎప్పటికీ నా సొంతం కావాలనిపిస్తుంది అంటాడు రిషి. నవ్వే కాదు నా ప్రాణం మీ సొంతం ఐ లవ్ యు సార్ అంటుంది వాసు లవ్ యు టూ  వసుధార అంటాడు రిషి. ఇక మల్లెపూల దండ అల్లి తన వసు తలలో పెట్టి దగ్గర తీసుకొని ప్రేమగా చాలా అందంగా ఉన్నావ్ వసుధార ముద్దు పెడతాడు. మరోవైపు శైలేంద్ర కోపంతో నేను చేయలేకపోతున్నానంటూ బెల్ట్ తీసుకుని తను తాను కొట్టుకుంటూ ఉంటాడు. గదిలోకి వచ్చిన దేవయాని శైలేంద్ర కొట్టుకోవడం చూసి ఏమిటి సైలేంద్ర అంటూ అడ్డుపడుతుంది.

 

Guppedantha Manasu November 3rd Episode in telugu
Guppedantha Manasu November 3rd Episode in telugu

అప్పుడు ధరణి కాఫీ పట్టుకొని వస్తుంది. కాఫీ అంటుంది నవ్వుతూ.. నీకు బుద్ధి ఉందా? ఏ సమయంలో ఏం చేయాలో తెలీదా నీకు అంటూ ధరణిని తిడుతుంది దేవయాని. అంటే టెన్షన్లో లో ఏం చేయాలో తెలియక ఆయన బెల్టుతో కొట్టుకుంటున్నారు కదా.. ఆయన టెన్షన్ మీ టెన్షన్ తగ్గించడానికి నేను కాఫీ తీసుకొచ్చాను అత్తయ్య ధరణి అంటుంది. శైలేంద్ర నాకు చిరాకు తెప్పిస్తున్నావ్. నేనేం చేశాను అండి కాఫీ తేవడం కూడా తప్పేనా? ధరణి కాఫీ తాగండి కాఫీ తాగి మీ తలనొప్పిని తగ్గించుకోండి. మళ్లీ మీకు కాఫీ కావాలి అనిపిస్తే అర్ధరాత్రి అయినా పర్వాలేదు నన్ను అడగండి కష్టం అనుకోకుండా నేను ఇస్తాను అప్పుడు కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర ధరణిపై అరుస్తాడు..

కుంటున్నారు నేను నిజమే చెబుతున్నాను. ఒకవేళ కాఫీకి తలనొప్పి తగ్గకపోతే నేను టాబ్లెట్ ఇస్తాను పరలేదండి మీరు ఏమి మాట పడొద్దు.. ఇలాంటి రోజు ఒక రోజు వస్తుందని ముందుగానే టాబ్లెట్ తెప్పించి ఉంచాను అని వెటకారంగా అంటుంది. అప్పుడు చూసావా మమ్మీ తను హద్దులు దాటి ఎలా మాట్లాడుతుందో అంటాడు శైలేంద్ర. నేను నా హద్దుల్లోనే ఉన్నానండి అంటుంది ధరణి మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Read Also : Janhvi Kapoor : జాన్వీ కపూర్ గ్లామర్ షో.. ఎద అందాలతో కుర్రాళ్ల మతులు పొగొట్టేస్తోంది.. వైరల్ వీడియో..!