RRR Movie Alluri : ఏదైనా ఒక సినిమాకు సంబంధించి బయోపిక్ నిర్మించినప్పుడు సినిమాకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తారు. RRR సినిమాని ఒక్కొక్క వివాదం చుట్టుముడుతోంది. నిన్న కొమరంభీమ్ టోపీ గొడవ చూశాం. RRR సినిమా స్టోరీ చారిత్రకమా లేక కల్పితమా? అలనాటి శిలాశాసనాలు,కావ్యాలు, అంశాలను ఆధారంగా చేసుకొని చారిత్రక కథను రూపొందించారు. ఈ కథనానికి తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలను కూడా మార్చారు. కొన్ని సన్నివేశాల్లో నాటకీయత జోడించారు.
అల్లూరి కి సంబంధించి ప్రస్తుతం హాట్ హాట్ చర్చ నడుస్తోంది. మా RRR కథ పూర్తి కల్పితం. మేమేమీ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల బయోపిక్ లని తీస్తామని చెప్పలేదే, ఆ చారిత్రక పురుషుల వీరత్వం, త్యాగాల ఇన్స్పిరేషన్ తో కొత్త కథని అళ్లుకున్నామని, దాని ప్రకారమే సినిమా తీస్తున్నామని అన్నారు. ఇందులో మీ అభ్యంతరాలు ఏంటని అన్నారు చిత్ర యూనిట్ అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజువరానికి చెందిన అల్లూరి సౌమ్య RRR చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకూడదని తన పిటిషన్లో కోరారు.RRR సినిమాలో అల్లూరి పాత్రపై వారి వంశస్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు ని పోలీస్ పాత్రలో చూపడం ఏంటని ప్రశ్నించారు.
ఇది చరిత్రను వక్రీకరించడం కాదా? అని వారు అడుగుతున్నారు. ఇక బ్రహ్మచారి అల్లూరి పేరిట సాగుతున్న పాత్రకు సీత అనే పాత్ర జోడిగా పెట్టడం ఏంటన్నారు. డ్యూయేట్ సాంగ్ లో సన్నిహితంగా ఉన్న సన్నివేశాలతో నింపుతారా అనేది వారి డౌట్.RRR టీమ్ కు ఇచ్చినట్లే, సెన్సార్ బోర్డుకు కూడా నోటీసు ఇచ్చారు అల్లూరి సౌమ్య తరపు న్యాయవాది రత్నం. పాన్ ఇండియా సినిమాల్లో ఇలాంటి పొరపాట్లు జరగడం కరెక్టేనా అని వీళ్ళు అడుగుతున్నారు.
ఇది భావితరాలకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కాదా? అవసరమైతే ఆ పేర్లు తీసేయండి,అంతేకానీ ఇలా పేర్లు పెట్టి మరీ పరువు తీయద్దని, మేము అల్లూరి కుటుంబంలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నామని అన్నారు.అల్లూరి కుటుంబ సభ్యుల ఆరోపణలను RRR మూవీ టీం పరిగణలోకి తీసుకుంటుందా లేదా లైట్ తీసుకుంటుందో చూడాలి. కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.
Read Also : దీప్తి సునయన పోస్ట్ వైరల్.. నేను పులిని అంటూ డైలాగ్..