...

RRR Release : పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుంది దానయ్య పరిస్థితి..!

RRR Release : టాలీవుడ్ అంటే బాహుబలి ముందు.. బాహుబలి తరువాత అనే విధంగా ఖ్యాతి గడించింది. దీనంతటికీ కారణం ఒకే ఒకరు రాజమౌళి.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. బాహుబలి తరువాత ఆయన తీసే సినిమా పాన్ ఇండియా స్థాయిలో కనీసం ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

దీంతో రాజమౌళికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్.ఆర్.ఆర్ సినిమాకు నిర్మాత డీవీవీ దానయ్య రూ.500 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో ఏడాదిలోగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని జక్కన ప్రకటించారు. అయితే ఇప్పటికే మూడేళ్లు దాటింది.. ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. గతంలో తీసిన బాహుబలి సినిమా విషయంలోను ఇలానే జరిగింది.

రెండు సిరీస్‌లో వచ్చిన బాహుబలి తీయడానికి రాజమౌళికి 5 ఏళ్లు పట్టింది. తాజాగా ఆర్ఆర్‌ఆర్ మూవీ కూడా చిత్రీకరణ పూర్తి చేయడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. అయితే రిలీజ్ ఎప్పుడు అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ సినిమా ప్రారంభం నుంచి అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, రాంచరణ్, బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్, ఆలియా భట్, ఇక హాలీవుడ్ నుంచి కూడా పలువురు స్టార్లు నటించారు. కరోనా మొదటి, రెండో వేవ్‌ను దాటుకుని ఈ సంక్రాంతి బరిలో జనవరి 7న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అందుకు తగ్గట్టుగా ప్రీరిలీజ్ ఈవెంట్లు కూడా ఘనంగా నిర్వహించారు.

ఉన్నట్టుండి కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. చాలాచోట్ల ధియేటర్లను మూసివేస్తే.. మరికొన్ని చోట్ల 50 శాతం ఆక్యపెన్సీతో నడిపిస్తున్నారు. దీంతో షాక్ గురైన చిత్ర యూనిట్.. ఆర్‌ఆర్‌ఆర్ మూవీని మరోసారి వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సినిమా మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మాత డీవీవీ దానయ్య.. తాజాగా ప్రమోషన్స్ కోసం భారీగానే ఖర్చుపెట్టినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది.

ప్రమోషన్స్ కోసం చెన్నై, త్రివేండ్రం, బెంగళూరు, ముంబైకి స్పెషల్ ఫ్లైట్స్‌లో తిరిగారు చిత్ర బృందం. ఇందు కోసం మరో రూ.20కోట్లు నిర్మాత దానయ్య ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఉన్నట్లుండి ఈ సినిమా మరోసారి వాయిదా పడడంతో ప్రమోషన్స్ కోసం పెట్టిన ఖర్చు వేస్టు్ అయినట్లే.

దీంతో ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీకి రూ.500 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించి.. తాజాగా ప్రమోషన్స్ కోసం మరో రూ.20 కోట్లు ఖర్చు చేసినా సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పలేని పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాత పరిస్థితి…. పెన్నం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉంది. ఈ సామెత దానయ్యకు సరిగ్గా సరిపోతుంది అనడంలో సందేహమే లేదు.

Read Also : Shanmukh Deepthi : షణ్ముక్, దీప్తి సునయన బ్రేకప్.. బిగ్‌బాస్ ఎంత పని చేసింది..?