RamCharan Love : జనరల్ గా ఇండస్ట్రీలో హీరోయిన్లు పొగడ్తలకు పడిపోతుంటారు అని అంటుంటారు. అది కూడా ఓ స్టార్ హీరో తనను పొగడ్తలతో ముంచెత్తితే ఇంకేముంది సదరు బ్యూటీ గాల్లో తేలి పోవడం ఖాయం. రీసెంట్ గా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ విషయంలోనూ అదే జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనుపమ పరమేశ్వరన్ ను ఆకాశంలోకి ఎత్తేశాడు. దాంతో అనుపమ ఫుల్ ఖుషి అవుతుందట. ఇక మ్యాటర్ లోకి వెళితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ను హీరోగా లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆశిష్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రాబోతున్న రౌడీ బాయ్స్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ కానుంది.
రీసెంట్ గా ఈ మూవీ మ్యూజికల్ నైట్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ సందర్భంగా త్రిబుల్ ఆర్ గురించి మాట్లాడుతూ సంక్రాంతికి మా సినిమా రాకపోయినా మాకు బాధ లేదు, మూడున్నరేళ్లు కష్టపడి చేసిన సినిమా కరెక్ట్ సమయంలో రావాలి. ఆ విషయం మా దర్శక నిర్మాతలు చూసుకుంటారని చెప్పుకొచ్చారు. అలాగే ఆశిష్ రెడ్డిని ప్రొడక్షన్ కాకుండా హీరోగానే కంటిన్యూ కావాలని చెప్పాడు రామ్ చరణ్.
ఇక క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పై ప్రశంసలు కురిపించారు చరణ్. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవుతుంటారని చెప్పారు. అంతే కాదు ఆమె ఎక్కడ ఉన్నా రూమ్ లో బల్బులాగా వెలుగుతుందన్నారు. అనుపమది చార్మింగ్ పర్సనాలిటీ అని, తన స్మైల్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుందని చరణ్ అన్నారు. అలాగే తెలుగు ఆడియన్స్ కి తక్కువ మంది తొందరగా నచ్చుతారు. అందులో టాప్ ప్లేస్ లో అనుపమ ఉంటారని చెప్పారు. అలాగే అనుపమా డాన్స్ కి ఫిదా అయిపోయాడు రామ్ చరణ్. ఇంకేముంది చరణ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోతుంది ఈ బ్యూటీ.మరి ఫ్యూచర్ లో ఈ అమ్మడు కి చరణ్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తుందేమో చూడాలి.
Read Also : Bigg Boss 6 telugu : యాంకర్ ఉదయభాను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందా!