Prakash Raj : భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో భాగంగా నేడు రేపు హైదరాబాదులో పర్యటించనున్నారు. హైదరాబాద్ రానున్న నరేంద్ర మోడీ పర్యటనపై నటుడు ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ టీఆర్ఎస్ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మోడీ పర్యటనలో భాగంగా ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో అద్భుతమైన పాలన జరుగుతుందని తెలియజేస్తూనే హైదరాబాద్ కి వస్తున్నటువంటి నాయకుడికి ప్రకాశ్ రాజ్ స్వాగతం అన్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాదులో పాలన ఎలా ఉందో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా నరేంద్ర మోడీకి ప్రకాష్ రాజ్ వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటనలను సైతం ఆయన ప్రస్తావించారు. బిజెపి పాలిత ప్రాంతలో కోట్ల రూపాయల పన్నులను కేవలం రోడ్లు వేయడం కోసం ఖర్చు చేశారని ఆయన తెలిపారు. కానీ తెలంగాణలో ప్రజలు కట్టిన పన్నులను ప్రజల అభివృద్ధి కోసమే ఉపయోగిస్తున్నామని ఈయన వెల్లడించారు.ప్రజలకు మౌలిక సదుపాయాలు ఎలా సమకూర్చాలో చూసి నేర్చుకోవాలని ప్రకాష్ రాజ్ నరేంద్ర మోడీనీ ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విధంగా తెలంగాణలో పాలన గురించి తెలియజేస్తూ ప్రకాష్ రాజ్ సీఎం కేసీఆర్ ఫొటో, యాదాద్రి, టీ హబ్, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రభుత్వ ఆసుపత్రి, గురుకుల పాఠశాల ఫోటోలను పెట్టారు వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే మోడీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ మొత్తం పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఈయన పర్యటన రద్దు అయ్యింది.
Read Also : Jobs notification: మరో 1663 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి!