వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Jobs notification: మరో 1663 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి!

Jobs notification: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్న ప్రభుత్వం… మరో 1663 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1663 ఖాళీల్లో.. ఇంజినీరింగ్ విభాగంలో 1522 పోస్టులు భర్తీ చేయనున్నారు. కొత్తగా భర్తీ చేయనున్నారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాల చూద్దాం. నీరు పారుదల శాఖలో 704 ఏఈఈ పోస్టులు ఉండగా… అందే శాఖలో 227 ఏఈ పోస్టులు ఉన్నాయి. అలాగే 212 ... Read more

By Vinod Kumar

Published on: July 2, 2022 6:42 PM

Updated on: July 2, 2022 6:42 PM

---Advertisement---

Jobs notification: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్న ప్రభుత్వం… మరో 1663 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1663 ఖాళీల్లో.. ఇంజినీరింగ్ విభాగంలో 1522 పోస్టులు భర్తీ చేయనున్నారు. కొత్తగా భర్తీ చేయనున్నారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాల చూద్దాం. నీరు పారుదల శాఖలో 704 ఏఈఈ పోస్టులు ఉండగా… అందే శాఖలో 227 ఏఈ పోస్టులు ఉన్నాయి. అలాగే 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, భూగర్భ జల శాఖలో 88 పోస్టులు, ఆర్ అండ్ బీ లో 38 ివిల్ ఏఈ పోస్టులు, 145 సివిల్ ఏఈఈ పోస్టులు, 13 ఎలక్ర్టిక్ ఏఈఈ పోస్టులు, 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఆర్థి శాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

తాజా అనుమతులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతుల ప్రక్రియను ఆర్థిక శాఖ ముమ్మరం చేసింది. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వనున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel