Pakkaa Commercial : మారుతి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమాలో గోపీచంద్ రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య జులై ఒకటవ తేదీ విడుదలైంది.ఇకపోతే మొదటి షో తోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సినిమా ఫస్ట్ రోజు ఎలా కలెక్షన్లను రాబట్టిందనే విషయాన్ని చిత్ర బృందం పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఇకపోతే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా బాగానే వసూళ్లను రాబట్టిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 6.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇకపోతే గోపీచంద్ నటించిన సినిమాలలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా పక్క కమర్షియల్ రికార్డు సృష్టించింది. గత చిత్రం సిటిమార్ సినిమా మొదటి రోజు 4.1 కోట్ల కలెక్షన్లను రాబట్టగా పక్క కమర్షియల్ సినిమా ఈ రికార్డును బ్రేక్ చేసింది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం మరొక ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమాలో గోపీచంద్ రాశి ఖన్నా ఇద్దరు కూడా లాయర్ పాత్రలలో అందరిని మెప్పించారు.ఇకపోతే ఈ సినిమా మొదటి రోజే ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడానికి కారణం సినిమా టికెట్లని చెప్పాలి. ఈ సినిమా టికెట్ల విషయంలో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాదులో సింగిల్ థియేటర్లో 100 మల్టీప్లెక్స్ లో 160 రూపాయల టికెట్లు రేట్లు చొప్పున అందుబాటులోకి తీసుకువచ్చారు.అదేవిధంగా ఆంధ్రాలో సింగిల్ థియేటర్లో 100 రూపాయలు మల్టీప్లెక్స్ లో 150 రూపాయల టికెట్ నిర్ణయించారు. ఈ విధంగా సినిమా టికెట్ల రేటు తక్కువగా ఉండడంతో ప్రేక్షకుల సైతం థియేటర్ కి వచ్చే సినిమాని చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇలా టికెట్లు రేట్లు తగ్గించడమే సినిమాకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి.
Read Also : Pakka Commercial Movie Review : పక్కా కమర్షియల్ మూవీ రివ్యూ.. నిజంగా కమర్షియలే.. పైసా వసూల్..!