...

Raids On Pub : పబ్ పై పోలీసుల దాడులు.. అదుపులో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్!

Raids On Pub : హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ పై పోలీసులు దాడి చేశారు. అక్కడ జరుగుతున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు. సమయానికి మించి పార్టీని కొనసాగించడంతో పాటు రేవ్ పార్టీని నిర్వహిస్తుండటంతో… మొత్తం 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పబ్ యజమానులతో పాటు 19 మంది సిబ్బంది, 99 మంది యువకులు, 39 మంది యువతులు ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో బిగ్ వాస్ విన్నర్, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

అంతే కాకుండా ఈ రేవ్‌ పార్టీపై దాడి చేసిన సమయంలో కొకైన్‌, గంజాయి, కొన్ని రకాల డ్రగ్స్‌, ఎల్‌ఎస్‌డీ సిగరెట్లను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. తమ అదుపులో ఉన్న యువతీ యువకుల నుంచి పోలీసులు వివరాలను సేకరించిన అనంతరం వారిని వదిలిపెట్టారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పబ్‌ యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Read Also : Niharika Pub Case : బంజారాహిల్స్ పబ్ కేసులో ప్రముఖులు.. నిహారికకు పోలీసుల నోటీసులు!

Advertisement
Advertisement