Mega Daughter Niharika : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ చాలా స్పెషల్. అందుకే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా వచ్చిందంటే దానిపై ఆడియన్స్, ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మెగా డాటర్ నిహారిక.. మెగా ఫ్యామిలీలో ఉన్న లేడీస్‌లో ప్రేక్షకులకు చాలా దగ్గరైంది మాత్రమే నిహారిక మాత్రమే. ఢీ షోతో టీవీ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి ఈ ముద్దుగుమ్మ.. తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన ఒక మనసు మూవీలో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పలు మూవీస్ లోనూ యాక్ట్ చేయడంతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ అందరినీ ఎంటర్ టైన్ చేసింది.
ఇటీవలే గుంటూరు చెందిన ఓ మాజీ పోలీస్ ఆఫీసర్ కొడుకు చైతన్యను నిహారిక పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె మూవీస్ కు దూరంగా ఉంటోంది. సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. నేను మూవీస్ లో యాక్ట్ చేయడం నా భర్తకు ఇష్టం లేదు. అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది. తనకు సినిమాలంటే పిచ్చి అని, ఆ ఇండస్ట్రీని ఎప్పటికి వదులుకోలేనని స్పష్టం చేసింది మెగా డాటర్.
చైతన్యతో పెళ్లి అయిన తర్వాత మెగా ఫ్యామిలీకి నిహరికా దూరంగా ఉంటోంది. ఏవైన కార్యక్రమాలకు లేదా పండుగలకు మాత్రమే తన ఫ్యామిలీని కలుస్తోంది. అయితే వీరిద్దరు వేరే కాపురం పెట్టారు. ఆ టైంలో వీరుంటున్న అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఇష్యూ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై చైతన్య క్లారిటీ ఇచ్చారు. దీంతో దానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక సపరేట్‌గా కాపురం పెట్టాల్సిన పరిస్థితులను తెలియజేసింది. తాను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ బయట నివసించలేదట.. కానీసం హాస్టల్స్ లోనూ ఉండలేదట. ఇక ప్రస్తుతం మ్యారేజ్ అయిందని.. కాబట్టి కొన్ని రోజులు ఎంజాయ్ చేసేందుకు సపరేట్ గా ఉంటున్నామని చెప్పుకొచ్చింది.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world