Niharika : మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీలో ఉన్న నియమాలను అతిక్రమించి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి అమ్మాయిగా నిహారిక వార్తల్లో నిలిచింది. మొదట బుల్లితెర మీద యాంకర్ గా సందడి చేసిన నిహారిక తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది .కానీ ఆమె నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. దీంతో నీహారిక కొంత కాలం సినిమాలకి దూరంగా ఉండి వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెట్టింది.
చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకున్న నిహారిక వివాహం తర్వాత కూడా నిర్మాతగా, నటిగా వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. అంతే కాకుండా సోషియల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే నిహారిక ఇన్స్టాగ్రామ్ నుండి వైదొలగడంతో నీహారిక విడాకులు తీసుకుంటుంది అంటూ వార్తలు విపించాయి. తర్వత రాడిసన్ పబ్ లో పార్టీ చేసుకుంటూ పోలీసులకి పట్టు బడటంతో నీహారిక వార్తల్లో నిలిచింది. దీంతో ఆమె ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ సంఘటన జరిగిన తర్వాత నిహారిక సైలెంట్ మూడ్ లోకి వెళ్ళిపోయింది. ఇలా పబ్ లో పట్టుబడటం వల్ల ఇటు అత్తింటి వారు, అటు పుట్టింటి వారు నిహారిక కి చివాట్లు పెట్టినట్టు సమాచారం. అంతే కాకుండా ఇలా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవాలంటే ఇలా పబ్ లలో కాకుండా ఇంట్లో పార్టీ చేసుకోమని చెప్పినట్టు సమాచారం. దీంతో నిహారిక సోషల్ మీడియాకి దూరంగ ఉంటోంది. ఇటీవల ఈ బాధ నుండి బయటపడటానికి నీహారిక తన భర్త చైతన్యతో కలిసి విదేశాలకు వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేసినట్టు సమాచారం. నిహారిక ప్రస్తుతం కొన్ని వెన్ సీరిస్ లలో నటిస్తూ, వాటిని నిర్మిస్తూ తన పని తాను చేసుకుపోతోంది
Read Also : Niharika : మరోసారి జిమ్ లో రచ్చ చేసిన నిహారిక.. ఫోటోలు వైరల్!
Tufan9 Telugu News And Updates Breaking News All over World